WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కార్యకర్తలకు ఆపద్బాంధవులు...!

ఒకరు సీనియర్‌ ఎమ్మెల్యే...మరొకరు ఎమ్మెల్సీ. నమ్మిన వారికి అండగా నిలుస్తారు..విధేయులకు పెద్దపీట వేస్తారు..కష్టాల్లో ఉన్నవారిని ఏదో విధంగా ఆదుకుంటారు...! ఇప్పటికే అనేక మంది కార్యకర్తలను ఆర్థిక పరంగా ఆదుకున్న ఘనత వారిద్దరిదీ. ఇందులో ఒకరు సీనియర్‌ ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు'. తన నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఆర్థికంగా చేయూతనిచ్చారు..ఇంకా ఇస్తూనే ఉన్నారు. అదే విధంగా పదిమంది ముస్లిం కార్యకర్తలకు 'హజ్‌యాత్ర'కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆయనే స్వయంగా భరించారు. ప్రత్యర్థుల చేతిలో హతమైన కార్యకర్తల కుటుంబాలను 'యరపతినేని' ఆదుకున్నారు. వారి పిల్లల చదువుల ఖర్చు భరించారు. వారి చదువు పూర్తి అయ్యాక ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి కల్పించారు. తాజాగా అనేక మంది కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకున్నారని గురజాల నియోజకవర్గ పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. వ్యాపారపరంగా వారేమీ సంపాదిస్తున్నారో మాకు అవసరం లేదు..కానీ పార్టీ పరంగా మాకు అండగా నిలుస్తున్నారు..ఆర్థికంగా ఆదుకుంటున్నారు...మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు...అని కొందరు మహిళలకు కూడా మీడియాతోవ్యాఖ్యానిస్తున్నారు. 

 కార్యకర్తల సంక్షేమనిధిని ప్రారంభించిన 'చినబాబు' స్ఫూర్తితో, బాపట్ల నియోజకవర్గంలో నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌ ప్రభాకర్‌'. ఇప్పటికే రూ.60లక్షలను విరాళాల రూపంలో స్వీకరించి నిధిని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీకి వచ్చే జీతభత్యాలను, ఇతర అల‌వెన్స్ (సుమారు రెండు లక్షల రూపాయలను) ఈ సంక్షేమ నిధికి కేటాయించారు. ఇది ఒక నెలకు కాదు..తన పదవి ఉన్నంత కాలం...ఆ జీత భత్యాలను ఆ నిధికే జమచేసే విధంగా 'సతీష్‌' ఏర్పాటు చేశారు. బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిబాటలో నడిపించడంలో 'సతీష్‌' చేసిన కృషికి 'చినబాబు', 'పెదబాబు'లు అనేక సందర్బాల్లో అభినందించారు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవిని తండ్రీకొడుకులు ఇప్పించారు. దీంతో వారిద్దరికి వీరవిధేయుడగా, అత్యంత నమ్మకస్తుడిగా 'సతీష్‌' మెలుగుతున్నారు. అప్పుడప్పుడు  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను స్వయంగా పిలిచి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. నెలకు సుమారు రూ.60లక్షలను కార్యకర్తలను ఆదుకునేందుకు 'సతీష్‌' ఖర్చుపెట్టబోతున్నారు. భవిష్యత్‌లో ఈ నిధిని మరింత రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఉదారంగా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ఈ సంక్షేమనిధికి విరాళాలు ఇవ్వడం విశేషం. ఇప్పటికే నిజాయితీపరుడిగా, అందరికీ అందుబాటులో ఉండే నాయకునిగాపేరు తెచ్చుకున్న ఈ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పెద్దల మన్నలతోపాటు నియోజకవర్గ ముఖ్యుల అభినందనలు పొందారు.

(373)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ