WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడా...!...చరిత్రహీనులు కావద్దు...! 'అన్నం'...!

కాపుజాతిని ఆర్థికపరంగా ఆదుకుంటూ అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభవం వ్యవహారశైలిపై ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌' ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వర్గాల్లో కాపులపై వ్యతిరేకత పెంచేందుకు 'ముద్రగడ' ప్రయత్నిస్తున్నారని, ఆయన చరిత్ర హీనుడు కావడం ఖాయమని 'అన్నం' విమర్శించారు. పాదయాత్ర చేసేవారందరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. అనుమతి తీసుకునేందుకు ప్రయత్నించకుండా తనను వేధిస్తూ, హిట్లర్‌గా 'చంద్రబాబు' వేధిస్తున్నారని 'ముద్రగడ' చేసిన వ్యాఖ్యలను 'అన్నం' ఖండించారు. 'తుని' సమావేశానికి అనుమతులు తీసుకోకపోవడంతోనే ఘర్షణలు జరిగాయని, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ఈ అనుభవాలతో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని 'అన్నం' అన్నారు. 

   కాపుజాతి ప్రయోజనాల కోసం తానుఉద్యమిస్తున్నాని పదే పదే చెప్పుకుంటున్న 'ముద్రగడ' శాంతిభద్రతల సమస్యను సృష్టించడమేపనిగా పెట్టుకుని ఆ జాతి ప్రయోజనాలను భంగం కల్గిస్తున్నారని 'అన్నం' ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాలను కాపులకు ప్రవేశపెట్టిన విషయం 'ముద్రగడ'కు తెలియదా...? ఎంతో మంది 'కాపులు' రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న విషయం ఆయనకు తెలియదా...? అని ఆయన ప్రశ్నించారు. కాపుజాతి ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఉద్యమిస్తే సమయమనం పాటించాలని శాంతిభద్రతల సమస్యకు అవకాశం ఇవ్వరాదని ఆయనసూచించారు. వై.ఎస్‌.జగన్‌తో పరోక్షంగా కుమ్మక్కై 'చంద్రబాబు'పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని, దీన్ని కాపు సోదరులు సహించరని 'అన్నం' స్పష్టం చేశారు. కాపు కులంలో చిచ్చు రగిల్చి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ జాతిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా, కాపు జాతికి ద్రోహం చేయాలని కుట్రలు పన్నినా...అటువంటి వారందరికి కాపులు తగిన గుణపాఠం చెబుతారని 'సతీష్‌' హెచ్చరించారు.

(211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ