WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాహుబలి' స్టిల్‌ విడుదల...!

దర్శకదిగ్గజం 'రాజమౌళి' రూపొందిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' చిత్ర స్టిల్‌ను రిపబ్లిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు.   'బాహుబలి: ది బిగినింగ్‌'లో దేవసేన పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించిన అనుష్క ఈ పోస్టర్‌లో చాలా అందంగా కనిపించారు. అమరేంద్ర బాహుబలితో కలిసి దేవసేన బాణం గురిచూస్తున్న పోజు ఆకట్టుకుంటోంది.ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచింది. ప్రభాస్‌, అనుష్కతోపాటు రానా, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  

(116)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ