WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ ముగ్గురినీ క్షమించను':చంద్రబాబు

గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, జెడ్పీ ఛైర్మన్‌ పార్టీ ప్రతిష్టను మంట గల్పి బజారుకీడ్చారని, ఈ విషయంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు ఆయనకు సన్నిహితులైన వారి వద్ద ఆవేశం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి రావెల కిశోర్‌బాబు, జడ్పీ ఛైర్మన్‌ జానీమూన్‌లు కష్టపడకుండానే పదవులు పొందారని వారిద్దరూ వ్యక్తిగత ప్రతిష్ట కోసం క్రమశిక్షణ మరిచిపోయి బజారున పడ్డారని, అతి త్వరలో దీని పరిణామాలు వారు చూస్తారని ఆయన ఆగ్రహంతో హెచ్చరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ముందు 'రావెల' ఎవరు? 'జానీమూన్‌' ఎవరు...? ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం పదేళ్లు కష్టపడి సొంత సొమ్మును ఖర్చుపెట్టుకుని, అనేక బాధలుపడ్డ విషయం నాకు తెలుసు. అప్పట్లో 'రావెల'కు సీటు ఇచ్చి పొరపాటు చేశాను. ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చి చాలా తప్పు చేశాను. ముస్లిం వర్గాలు 'జగన్‌'కే మద్దతు ఇస్తున్నారని, టిడిపికి మద్దతు ఇవ్వరని తెలుసుకున్నాకే ఆ వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వలేదు. కానీ...'జానీమూన్‌'కు జడ్పీ ఛైర్మన్‌ పదవిని అయిష్టంగానే ఇచ్చాను. మంత్రి పుల్లారావు చేసిన పిచ్చిపని ఇది. 

   బిసీ వర్గాల్లో, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తే...ముస్లిం బూచి చూపించి 'పుల్లారావు' జానీమూన్‌కి పదవి ఇప్పించారు. ఇప్పుడేం జరిగింది. మంత్రి పుల్లారావు ఒక విధంగా పార్టీకి నష్టం కల్గించారు. మరో మంత్రి 'రావెల' జడ్పీ ఛైర్మన్‌ 'జానీమూన్‌' పార్టీని అప్రదిష్టపాలు చేశారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరినీ క్షమించను..ఆ సమయంలో త్వరలో రానుంది. 'జానీమూన్‌' జడ్పీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పనిసరిగా తప్పుకోవాల్సిందే. బీసీ వర్గానికి చెందిన మరో మహిళకు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాల్సిందే. 'మనం ఎన్ని సౌకర్యాలు కల్పించినా, సంక్షేమపథకాలు అమలు చేసినా...ముస్లిం వర్గాలు పాత పోకడలోనే వెళుతున్నాయి. వారి ఓట్లు కోసం పాకులాడే కన్నా...పార్టీకి అండగా ఉండే బీసీ ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటే సరిపోతుందని ఆయన అన్నట్లు సమాచారం. ముందుగా 'జానీమూన్‌'ను తప్పించండి. బీసీ మహిళకు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇవ్వండి..మంత్రుల వ్యవహారం...సమయం వచ్చినప్పుడు తేలుస్తాను...! అని 'బాబు' పార్టీ ముఖ్యుల వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మంత్రులు పుల్లారావు, రావెలకు పదవులు ఊడడం ఖాయమని, జడ్పీ ఛైర్మన్‌ను కూడా తొలగిస్తారని పార్టీ వర్గాలకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. చేజేతులారా...? స్వయంకృతంతో ఆ ముగ్గురు..తమ పదవులకు ఎసరు కొని తెచ్చుకున్నారని పార్టీవర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.

(8525)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ