ప్రత్యేక ముసుగులో 'జగన్‌' విధ్వంస కుట్ర:అన్నం 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రత్యేక ముసుగులో 'జగన్‌' విధ్వంస కుట్ర:అన్నం

ప్రత్యేక హోదా ఉద్యమం ముసుగులో రాష్ట్రంలో విధ్వంసానికి ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ కుట్ర చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ 'అన్నంసతీష్‌ ప్రభాకర్‌' ఆరోపించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికార దాహంతో రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేయడానికి దుర్మార్గ వైఖరిని 'జగన్‌' అవలంభిస్తున్నారని 'అన్నం' దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యపడుతుందని 'జగన్‌' చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని ఆయన మాయలో యువత పడవద్దని 'అన్నం' పిలుపునిచ్చారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు పొందేందుకు ముఖ్యమంత్రి 'చంద్రబాబు' ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, ప్రత్యేక ప్యాకేజీకి త్వరలో చట్టబద్ధత లభించనుందని 'సతీష్‌' తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వంపై 'జగన్‌' ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని 'అన్నం' విమర్శించారు. అమాయకమైన కాపు సోదరులను 'ముద్రగడ పద్మనాభం' ద్వారా 'జగన్‌' రెచ్చగొడుతున్నారని 'అన్నం' ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు 'జగన్‌' కుటిల రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు ఆయనను నమ్మే ప్రసక్తేలేదని 'అన్నం' చెప్పారు. ప్రజలందరూ సమయమనం పాటించాలని, యువత శాంతియుతంగా మెలగాలని, ఎటువంటి అల్ల‌ర్ల‌కు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతం ఉండేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తే అందరికన్నా ముందు నిలబడి ఉద్యమం చేయడానికి 'చంద్రబాబు' సిద్ధంగా ఉంటారని ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి 'చంద్రబాబు'ను అప్రదిష్టపాలు చేసేందుకు ఇంతకు ముందు 'జగన్‌' ఎన్నో ప్రయత్నాలు చేశారని, ప్రజలు ఆయనకు సహకరించలేదని, ముందు ముందు కూడా ఆయనకు సహకరించరని ఆయన అన్నారు.రెండేళ్లల్లో ముఖ్యమంత్రి అవుతా...మీ అంతు చూస్తానని...అధికారులను బెదిరిస్తున్నారు...ఇది ఆయనకు ఎంత వరకు సబబు...ఇది ఆయన అహంకారాన్ని చూసిస్తోందని, మరో రెండున్నర్లేళ్లు గడువు ఎన్నికలకు ఉండగా ఆయన సిఎం ఎలా అవుతారని 'సతీష్‌' ప్రశ్నించారు.


(593)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ