WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అన్నదానం' కన్నా 'అవయవదానమే' మిన్న...!

యాభైవేల మందిని అవయవదాతలుగా ఒప్పించి 25లక్షల మందికి చేయూత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శాసనసభాపతి 'కోడెల శివప్రసాదరావు'. ఇప్పటి వరకు 10వేల మంది దీనికి స్పందించి ముందుకు వచ్చారని త్వరలో మిగతా 40వేల మందిని కూడా అవయవదానానికి ఒప్పిస్తామని 'కోడెల' చెబుతున్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలో ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెబుతున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా ఆయన కుమారుడు 'కోడెల శివరామ్‌' కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తండ్రి కన్నా తనయుడే ఎక్కువ కృషి చేస్తున్నారని అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికి మరుగుదొడ్డి నినాదం చేపట్టి 'సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో నూటికి నూరుశాతం విజయవంతం చేసిన ఘనత 'కోడెల'కే దక్కింది. అంతే కాకుండా స్మశానవాటికల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని దానాలలో కెల్లా 'అన్నదానం' గొప్పదని నిన్నటి వరకు చెబుతుంటారు.. తాజాగా అన్నదానం కన్నా 'అవయవదానమే' అత్యంత విలువైనదని ప్రజలకు తెలిసేవిధంగా వారిలో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని 'కోడెల' చేపట్టారు. 

  ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో సిసి రోడ్డుల నిర్మాణం మిగతా ప్రాంతాలకన్నా ఎక్కువగా జరిగింది. ప్రతి గ్రామంలో దళిత కాలనీలు అభివృద్ధి చేయడం, ఆయా కాలనీలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రూ.700కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేసినట్లు తెలుస్తోంది. 'కోడెల సత్యనారాయణ' మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా పలువురికి సహాయ,సహకారాలు అందించారు. ఏ నియోజకవర్గంలో చేయని విధంగా 'సత్తెనపల్లి' నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో సిసిరోడ్లును నూటికి నూరుశాతం పూర్తి చేయడం జరిగింది. 

  స్పీకర్‌ కోడెల, ఆయన కుమారుడు యువనేత 'శివరామ్‌' ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని,మరి కొన్ని త్వరలో జరగనున్నాయని ఆ రెండునియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 'మా గ్రామాలు ఈ విధంగా అభివృద్ది చెందాయంటే స్పీకర్‌ కోడెల వల్ల ఆయన కుమారుడు 'శివరామ్‌' వల్లే సాధ్యమైందని పలువురు ఎంపిపిలు కూడా అంటున్నారు. ఏదైనా నూతన కార్యక్రమాన్ని తీసుకుని దాన్ని విజయవంతం చేయగల సమర్థత, నేర్పు, ఓర్పు 'కోడెల' కుటుంబానికి ఉందని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్పష్టమైందని అధికారులు చెబుతున్నారు. మరో సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అవుతాయని, అర్హులైన వారందరికీ ఫించన్లు ఇప్పించారని, రాష్ట్రంలో 'సత్తెనపల్లి' నియోజకవర్గం నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకుని మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా మారబోతుందని దీని వెనుక తండ్రీ,కొడుకుల కృషి ఎంతో ఉందని 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపారాలు, అధికార పార్టీ ముఖ్యలు చెబుతున్నారు.


(633)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ