WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫ్యాక్షనిస్టు నిజ రూపం బట్టబయిలు అయింది...!

త్వరలో తాను ముఖ్యమంత్రి అవుతానంటూ..బెదిరించే రీతిలో పోలీసులపై దూకుడుగా వ్యవహరించి తన ఫ్యాక్షనిస్టు నైజాన్ని బయటి ప్రపంచానికి వై.ఎస్‌.జగన్‌ తన నిజస్వరూపాన్ని చాటారని ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌' ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాత, తండ్రుల ఫ్యాక్షనిజాన్ని వారసత్వంగా తీసుకుని రౌడీయిజానికి, బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్న విషయం విశాఖ ఎయిర్‌పోర్టులో స్పష్టమైందన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రభుత్వ పాలనా వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఏపాటిదో ఆయన స్వయంగా చూపారని, పోలీసు అధికారులపై చేసిన విమర్శలను బట్టి ఇది స్పష్టం అవుతుందని 'అన్నం' అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎవరినైనా అడ్డుకునే అధికారం పోలీసులకు ఉంటుందని, ప్రతిపక్షనేత ముఖ్యమంత్రి కాదు కదా...? విధి నిర్వహణలో పోలీసు అధికారులు సంయమనంతో వ్యవహరించారని, వారిపై దౌర్జ్యన్యానికి పాల్పడ్డంతో ఆయన మానసిక పరిస్థితి ఏ స్థితిలో ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. దూకుడు స్వభావం, ఆవేశపరమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రతిపక్షనేతగా ఉండడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టమని 'అన్నం' చెప్పారు. విశాఖ బీచ్‌లో కార్యకర్తలను రెచ్చగొట్టే అవకాశం ఉన్నందునే శాంతిభద్రతలను పరిరక్షించేందుకే పోలీసులు ఆయనను అడ్డుకున్నారే తప్ప మరో కారణం లేదని ఆయన వివరించారు. 'తుని' వంటి హింసాత్మక ఘటన పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా 'జగన్‌'ను పోలీసులు అడ్డుకున్నారని, దీనిలో ఎటువంటి రాజకీయకోణం లేదని దీన్నీ రాజకీయ వేధింపులుగా చిత్రీకరిస్తూ 'జగన్‌' పార్టీ నేతలు చేస్తోన్న హంగామాను ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ను అలుసుగా తీసుకుని కొంత మంది సంఘ విద్రోహశక్తులు అల్ల‌ర్ల‌కు పాల్పడితే దానికి బాధ్యులు ఎవరు? అని 'అన్నం' ప్రశ్నించారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని, నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి అధికమొత్తంలో నిధులు రాబట్టారని ఆయన కొనియాడారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్షనేత ప్రభుత్వానికి అండగా ఉండాల్సి ఉండగా విలువ లేని ధర్నాలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఇప్పటికైనా 'జగన్‌' తన తప్పులను సరిచేసుకోవాలని 'అన్నం' సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రింభవళ్లు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు పలు పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నారని, ఈ సమయంలో ధర్నాలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకోవడం ఏ ఒక్కరికీ తెలియదని 'అన్నం' అన్నారు.


(334)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ