WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న 'ఫెదరర్‌'...!


టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ మరో గ్రాండ్‌స్లామ్‌టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫెనల్‌లో 'ఫెదరర్‌' 'రఫెల్‌నాదల్‌'తో హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. అయిదు సెట్ల పోరులో రోజర్‌ ఫెదరర్‌ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో రఫెల్‌ నాదల్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఫెదరర్‌ కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో, పదునైన షాట్లతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు.ఆట ఆరంభం నుంచే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు తీవ్రంగా పోరాడారు. మొదటి సెట్‌ను 6-4 తేడాతో రోజర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్‌లో పుంజుకున్న నాదల్‌ 6-3తో ఫెదరర్‌పై విజయం సాధించాడు. మూడో సెట్‌ను 6-1 తేడాతో అలవోకగా గెలుచుకున్న ఫెదరర్‌.. నాలుగో సెట్‌లో 3-6తో నాదల్‌కు కోల్పోయాడు. నిర్ణయాత్మకమైన అయిదో సెట్‌లో 4-3 వద్ద ప్రత్యర్థిని బ్రేక్‌ చేసిన ఫెదరర్‌.. 6-3 తేడాతో సెట్‌ను గెలుచుకుని టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.

(190)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ