WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడ‌వద్దు...!

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడ‌వద్దని, వారి భవిష్యత్‌ను నాశనం చేస్తే విద్యార్థులు తరిమి కొడతారని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌  'వై.ఎస్‌.జగన్‌'ను హెచ్చరించారు. బాపట్లలో 'జగన్‌' పార్టీ నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని జరగనీయబోమన్నారు. ప్రశాంతమైన వాతావరణం, క్రమశిక్ష బాపట్ల పట్టణంలో ఉందని, దేశంలోనే ఉత్తమమైన విద్యాకేంద్రంగా 'బాపట్ల'కు పేరు ఉందని దీనిని కలుషితం చేయవద్దని ఆయన 'జగన్‌'కు హితవు పలికారు. విద్యావ్యవస్థను కలుషితం చేస్తే కార్యక్రమాలను తాము అడ్డుకుంటామని 'అన్నం' చెప్పారు. ఇప్పటికైనా 'బాపట్ల' యువభేరి కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే విద్యార్థులే 'జగన్‌'ను తరిమికొడతారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పక్కదారి పట్టిస్తే వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించరని వారు నిలదీస్తే మీరేమి సమాధానం చెబుతారని 'అన్నం' 'జగన్‌'ను నిలదీశారు. స్థానిక 'జగన్‌' పార్టీ నాయకులు ఆయనకు నచ్చ చెప్పి బాపట్లలో యువభేరిని నిలిపివేయించాలని ఆయన కోరారు. విద్యార్థులకు ఆయన ఏమి బోధిస్తారు...'జైలు' అనుభవాలను తెలియజేస్తారా..? లేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిని చేయడంపై వివరిస్తారా...? అసలు మీపయనం ఏమిటి...? విద్యార్థి లోకాన్ని ఏమి చేయదల్చుకున్నారు...అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించారు...విద్యావ్యవస్థను బ్రష్టుపట్టించేందుకే యువభేరి నిర్వహిస్తున్నారా? అని ఆయన నిలదీశారు.ఇప్పటికైనా 'జగన్‌' కళ్లు తెరిచి వాస్తవాలను గుర్తించి ముందుకు వెళ్లాలని అంతేకాని విద్యార్థులతో చెలగాటమాడి వారి భవిష్యత్‌ను నాశనం చేయవద్దని ఆయన కోరారు.






(156)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ