WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ధోని'ని బాగా వాడుకో...!

మాజీ కెప్టెన్‌ 'ధోనీ'ని బాగా వాడుకోవాలని భారత మాజీ ఆటగాడు గంగూలీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 'ధోనీ'కి ప్రమోషన్‌ ఇవ్వాలని, అతను ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఆడుతున్నాడని, ఇటువంటి సమయంలో 'కోహ్లీ' అతడిని సరిగా ఉపయోగించుకోవాలని సూచించాడు. బుధవారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. భారత్‌ రెండో టీ-ట్వంటీలో గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం జట్టుకు మంచిది కాదని గంగూలీ పేర్కొన్నాడు. బెంగళూరులో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్నాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పాడు.''రైనాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల చివర్లో భారీ షాట్లు ఆడే ఆటగాడిని కోల్పోతున్నాం. పాండ్యా, ధోనీ ఉన్నా.. లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉడడం కొంత మంచిదని నాకనిపిస్తుంది. కాబట్టి అతని ఆర్డర్‌లో మనీష్‌ పాండేని పంపాలి.  


(202)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ