WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

4వ తేదీన 'కాటమరాయుడు' టీజర్‌ విడుదల...!

'పవన్‌' అభిమానులకు ఇది సంతోషం కల్గించే వార్త. ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న 'పవన్‌' 'కాటమరాయుడు' సినిమా టీజర్‌ను 4వ తేదీన విడుదల కానుంది. వాస్తవానికి ఈ టీజర్‌ జనవరి నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల టీజర్‌ విడుదల ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌ విడుదల అయింది. పోస్టర్‌ చూసిన అభిమానులు సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుని టీజర్‌ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ నెల4వ తేదీ సాయంత్రం 4 గంటలకు టీజర్‌ విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ విషయాన్ని 'పవన్‌' అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ సందడి చేసుకుంటున్నారు.

(195)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ