WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పవర్‌స్టార్‌...మెగాస్టార్‌...త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా...!

మెగాస్టార్‌ చిరంజీవి ఆయన సోదరుడు పవర్‌స్టార్‌ 'పవన్‌కళ్యాణ్‌' కలసి ఓ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్‌' దర్శకత్వం వహించబోతున్నారట. ఈ వార్త తెలుగుసినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ మొహానికి రంగేసుకుని 'ఖైదీనెంబర్‌ 150' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'చిరంజీవి' భారీ హిట్‌ కొట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నారు.అదే విధంగా యువతలో మంచి పాలోయింగ్‌ ఉన్న 'పవర్‌స్టార్‌' 'పవన్‌కళ్యాణ్‌' అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు హిట్‌ అయినా ప్లాప్‌ అయినా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్‌ తగ్గదు...ఇటువంటి క్రేజీ కాంబినేషన్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తోడయితే ఇక చెప్పేదేముంది...బాక్సాఫీస్‌ షేక్‌ కావాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత,ఎంపి టి.సుబ్బరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారట. మరో నిర్మాత 'అశ్వనీదత్‌' దీనికి సహనిర్మాతగా వ్యవహరించనున్నారట.

(142)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ