WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నాకు ఎవరూ పిల్లనివ్వడం లేదు...

'తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ కలిగిన టివీ కార్యక్రమం 'జబర్దస్త్‌'. ఈ ప్రోగ్రామ్‌లో నటించే నటీనటులందరూ రాత్రికి రాత్రే స్టార్‌లు అయిపోయారు. ఇప్పుడు వారు ఏం చేసినా 'ప్రజలకు' అదో విశేషమే. మరి అటువంటి కార్యక్రమంలో యాంకర్‌గా ఉన్న 'రష్మి'కి దానిలో నటించే 'సుడిగాలి సుధీర్‌'కు మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు వస్తే ఇంకేముందీ అందరిలోనూ అదో చర్చ. ఇంతకు ముందే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు రాగా యాంకర్‌ 'రష్మి' దాన్ని కొట్టిపారేయలేదు...సరికదా...ఎవరికి కావాల్సిన విధంగా వారు రాసుకోండి...ఇంకా కావాలంటే మసాలా జోడించి రాసుకోండి...నాకు పోయేదేముందని తేలిగ్గా చెప్పేసింది. 'రష్మి' వలే 'సుధీర్‌' స్పందించడం లేదు. కార్యక్రమంలో నవ్వులు ఎక్కువ పండించడానికి రచయితలు 'రష్మీ'కి తనకు లింకు పెట్టి రాస్తుంటారని...దాన్ని నిజమని చాలా మంది భావిస్తున్నారని వాపోయారు. 

   తనకు,రష్మీకి మధ్య ఏమీ లేదని, కానీ ఈ విషయం నిజమని నమ్మి తనకు పిల్ల నివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నవ్వు పుట్టించడానికి వాడిన డైలాగ్‌లు ఇప్పుడు తన పాలిట శాపంగా మారాయని..నిజంగా తనకూ,రష్మికీ మధ్య ఏదో ఉందని చాలా మంది భావిస్తారని...అయితే అదంతా నిజం కాదని 'సుధీర్‌' చెబుతున్నాడు. ఇంకా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు రచయితలు రాస్తున్నారని...దీంతో తాను చాలా చెడ్డవాడినని ఎక్కువ మంది అనుకుంటారని కానీ తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని 'సుధీర్‌' స్పష్టం చేశాడు. విశ్రాంతి కోసం తాను అప్పుడప్పుడు బయటకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటానని చెప్పాడు 'సుధీర్‌'. మొత్తం మీద ఈ జంట తమ కెరీర్‌ కోసం లేనివి ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ తంతు ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.


(272)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ