WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.20వేలకే హీరో స్కూటర్‌...!

అతి తక్కువ ధరకే ప్రముఖ టూ వీలర్‌ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించింది. కేవలం 20వేల రూపాయలకే ఈ స్కూటర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది. విద్యుత్‌తో నడిచే ఈ స్కూటర్‌ ఒకసారి ఛార్జ్‌ చేస్తే 65 కీలోమీటర్లు తిరగొచ్చట. సుదూర ప్రాంతాలు కాకుండా దగ్గర దగ్గరలో తిరిగేవారికి ఈ వాహనం బాగా పనిచేస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. 48-వోల్ట్‌ 20ఏహెచ్‌ వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీ సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందించారు. స్కూటర్‌ గరిష్ట వేగం రూ. 25 కిలోమీటర్లు. దీని బరువు 87 కిలోలు. మెగ్నీషియల్‌ ఎల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌ ఈ స్కూటర్‌ ప్రత్యేకత. ఈ రోజు మార్కెట్‌లోకి విడుదల అయిన ఈ వాహనం త్వరలో అన్ని ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి వస్తుందని హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ గ్లోబల్‌ తెలిపారు.


(243)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ