WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వ్యక్తిగత విషయాలు చెప్పను...!

మాజీ క్రికెటర్‌ 'జహీర్‌ఖాన్‌'తో డేటింగ్‌ చేస్తోన్న హీరోయిన్‌ 'సాగరిక' ఆ విషయాన్ని తాను చెప్పనని, వ్యక్తిగత విషయాలు మీడియాకు ఎందుకని ఎదురు ప్రశ్నిస్తోంది. తానెప్పుడూ మీడియాతో మాట్లాడనని, తానిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని, తనను ఇలాగే ఉండనివ్వాలని ఆమె మీడియాను అభ్యర్థిస్తోంది. 'జహీర్‌'పై తనకు చాలా గౌరవం ఉందని, తాజా సినిమా 'ఇరాదా' విడుదలైనప్పుడు 'జహీర్‌' చూస్తాడని తెలిపింది. ఇటీవల జరిగిన యువరాజ్‌ సింగ్‌ వివాహానికి ఇరువురు కలిసి హాజరై ఆశ్చర్యపరిచారు. షారుక్‌ ఖాన్‌ నటించిన చెక్‌ దే ఇండియా మూవీలో సాగరిక హాకీ క్రీడాకారిణి ప్రీతీ సబర్వాల్‌ పాత్రలో నటించింది.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ