WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మార్చి13 నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు లేవు...!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు శుభవార్తలు ప్రకటించింది. మార్చి 13 నుంచి సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి నగుదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. దీంతో రోజువారి, వీక్లీ విత్‌డ్రాలపై ఉన్నపరిమితులు ఎత్తివేసినట్టు అవుతుంది. రెండు విడతల్లో సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లను రిలాక్స్‌ చేయనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి విత్‌డ్రా పరిమితి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నారు. మార్చి 13 నుంచి పూర్తిగా పరిమితులు ఎత్తివేస్తారు. దీంతో నోట్లరద్దు తర్వాత విధించిన ఆంక్షలు పూర్తిగా తొలిగి యథాపూర్వ పరిస్థితి ఏర్పడుతుంది.

(142)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ