WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విలన్‌' అవతారమెత్తనున్న 'శ్రీకాంత్‌'...!

అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒకటి,రెండు సినిమాల్లో విలన్‌పాత్రలు పోషించి మెప్పించాడు హీరో శ్రీకాంత్‌. తరువాత 'పెళ్లిసందడి'తో స్టార్‌హీరోగా మారాడు. అయితే అతను అదే రేంజ్‌లో తరువాత తన కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు.  ఒకరు ఇద్దరు హీరోలతో తెరను పంచుకుంటూ కెరీర్‌ను నెట్టకొచ్చాడు. చివరకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాడు. అయితే ఇప్పుడూ ఆ అవకాశాలు పెద్దగా రావడం లేదు.దీంతో విలన్‌గా మారాలని నిర్ణయించుకున్నాడట.   కాకపోతే టాలీవుడ్‌లో బోలెడంత మంది విలన్లు ఇప్పటికే ఉన్నారు కనుక మాలీవుడ్‌కి వెడుతున్నాడు. మోహన్‌లాల్‌ సినిమాలో విలన్‌గా చేయబోతున్నాడు. ఇంతమంది విలన్లు ఉండగా శ్రీకాంత్‌ని తీసుకోవడంలో ఓ మెలిక ఉంది అంటున్నారు సినీజనాలు. ఈ సినిమాను టాలీవుడ్‌లో డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయట! ఆల్‌రెడీ ఉన్న విలన్లు తెర మీద బోలెడన్ని సార్లు కనిపించి బోర్‌ కొట్టించేశారు. శ్రీకాంత్‌ అయితే ఫ్రెష్‌గా కనిపిస్తాడని మాలీవుడ్‌ దర్శకనిర్మాతలు భావిస్తున్నారట! టాలీవుడ్‌లో శ్రీకాంత్‌ విలన్‌గా సక్సెస్‌ సాధిస్తే మరో మంచి విలన్‌ దొరికినట్టే అంటున్నారు సినీజనాలు.  

(223)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ