WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క్రైస్తవ సువార్త సభలకు వెళ్లిన 'టీటీడీ'బోర్డు సభ్యుడు...!

ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాలకమండలి సభ్యుడు. వేంకటేశుని సేవకునిగా ఉన్న ఆయన చేయకూడని తప్పు చేశారు. పరమపవిత్రమైన  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటూ అన్యమత ప్రచారానికి వెళ్లి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరను కుంటున్నారా...? ఆయన ఎవరో కాదు...మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి 'పుట్టా సుధాకర్‌ యాదవ్‌'. గత ఎన్నికల్లో టిడిపి తరుపున ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన తరువాత 'చంద్రబాబు' దయతో టీటీడీ బోర్డు సభ్యుడు అయ్యారు. ఏడుకొండల స్వామికి సేవకుడుగా ఉంటూ 'యేసు స్వస్థగిరి తిరుణాల'కు వెళ్లాడట. ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా విమర్శలు కొని తెచ్చింది. ఆయన శ్రీవేంకటేశ్వరస్వామికి సేవకుడిగా ఉంటూ అన్యమత సభలకు వెళ్లి ఆశీర్వచనం తీసుకోవడంపై విమర్శలు వెళ్లెత్తుతున్నాయి. 

   బహిరంగ వేదికపై క్రైస్తవ మతగురువులు ఆయన తలపై చేతులు పెట్టి ఆశీర్వచనం పలికారు. 'వీరు వేంకటేశ్వరస్వామి భక్తులు...కానీ నేటి నుంచి ఏసును నమ్ముచున్నారు'...అంటూ వారు ఆశీర్వచనం ఇచ్చారు. దీనిపై వేంకటేశ్వరస్వామి భక్తులు...టిడిపి కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. ఆయన వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని నమ్మితే...టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మతంలో చేరవచ్చుకదా...? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారకులు ప్రచురించిన పోస్టర్‌లో 'పుట్టా సుధాకర్‌యాదవ్‌' టీటీడీ బోర్డు సభ్యులు అని కూడా ముద్రించి కరపత్రాలను పంచిపెట్టారు. పలువురు భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వీరే ఇతర మతాల ఓట్ల కోసం ఇంత దిగజారే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం సరికాదని అటు టీటీడీ ఉద్యోగులు, భక్తులు, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సదరు నాయకునిపై చర్య తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. మరి పాలకులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.


(784)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ