WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వాళ్లు తాగితే తప్పు లేదా...? నేను డాన్స్‌ చేస్తే తప్పా....?

'జబర్దస్త్‌' యాంకర్‌ 'అనసూయ' వివాదంలో ఇరుక్కుంది. ముప్పయి సంవత్సరాలు దాటినా హాట్‌ హాట్‌ అందాలతో యువతను మత్తెక్కిస్తోన్న 'అనసూయ' 'విన్నర్‌' సినిమాలో హాట్‌ హాట్‌గా చేసిన డాన్స్‌ వివాదాస్పదం అవుతుంది. 'సాయిధరమ్‌తేజ్‌' సినిమా 'విన్నర్‌'లో 'అనసూయ' ఓ పాటలో అర్థనగ్నంగా డాన్స్‌ చేస్తుంది. అయితే ఈ డాన్స్‌ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఎందుకంటే 'అనసూయ' డాన్స్‌ చేసేటప్పుడు ఆమె వెనుక 'బుద్ధవిగ్రహం' ఉందట. ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంచిన 'గౌతమబుద్దుడి' విగ్రహం ముందు ఈ పోరంబోకు డాన్స్‌లు ఏమిటని జనాలు ప్రశ్నిస్తున్నారట. మీకేం పోయే కాలం వచ్చింది...బుద్ధవిగ్రహం ముందు చిల్లర గంతులు ఏమిటని అంటున్నారట. దీంతో 'అనసూయ'కు తిక్కరేగిందట. ఆ విగ్రహం పెట్టిన దగ్గర బార్‌ ఉంది..అక్కడ ఉన్న 'జనం' ఆ విగ్రహం ముందే రోజూ మందు తాగుతారు...నేను డాన్స్‌ చేస్తే తప్పయిందా...? అంటూ తనను విమర్శించేవారిపై విరుచుకుపడుతుందీ ఆంటీ...! మొత్తానికి 'అనసూయ'కు 'జబర్దస్త్‌' బుద్ధులు బాగానే వంటపట్టాయని నిట్టూరుస్తున్నారు...ఆమె విమర్శకులు...!


(364)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ