WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నా షోకు 'బాలయ్య' వస్తారు...!

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన షో 'మీలో ఎవరు కోటీశ్వరు'...! హిందీలో కౌన్‌బనేగా కరడోపతి కార్యక్రమం ఆధారంగా తెలుగులో మాటీవీ దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు 'అక్కినేని నాగార్జున' హోస్ట్‌గా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం నుంచి ఆయన తప్పుకోవడంతో నిర్వాహకులు మెగాస్టార్‌ 'చిరంజీవి'ని కార్యక్రమానికి హోస్ట్‌గా ఎన్నుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రొమోలు విడుదల అవుతున్నాయి. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ సందర్భంగా 'చిరంజీవి' మీడియాతో మాట్లాడుతూ దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత ముఖానికి మళ్లీ రంగు వేసుకున్నానని, ఖైధీనెం.150 సినిమా హిట్‌తో తాను మంచి జోష్‌లో ఉన్నానని తెలిపారు. 

  గతంలో తాను 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి హాజరయ్యానని...ఇప్పుడు తన కార్యక్రమానికి 'అక్కినేని నాగార్జున' వస్తారని చెప్పారు. అదే విధంగా 'నందమూరి బాలకృష్ణ'ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారా...? అని ప్రశ్నించగా తప్పకుండా ఆహ్వానిస్తాను...ఆయన నా స్నేహితుడు...తప్పకుండా ఈ షోకు ఆయన వస్తారు...అని బదులిచ్చారు...'చిరంజీవి'. ఇటీవల కాలంలో 'చిరంజీవి' అభిమానులు 'బాలయ్య' అభిమానులు...తమ హీరోల సినిమాలు హిట్‌ కావాలని...అదే సమయంలో తమ సినిమా హిట్‌...అంటే హిట్‌ అని సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. అయితే అభిమానుల మధ్య విభేదాలు ఉన్నా ఈ ఇద్దరు సీనియర్‌ హీరోలు ఎప్పటి నుంచో మంచి మిత్రులు...ఆ సంగతి 'బాలయ్య' కూడా ఇటీవలే చెప్పారు. అంటే రాబోయే కాలంలో బుల్లితెరపై వీరద్దరు వీక్షకులను కనువిందు చేయబోతున్నారన్నమాట.
(426)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ