WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పెదబాబు...చినబాబు' బాటలో 'అన్నం'...!

మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పెదబాబు, చినబాబులతో తోడ్పాటుతో ఎమ్మెల్సీ పదవి పొందిన 'అన్నం సతీష్‌ప్రభాకర్‌' తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలన్నింటిని అనుసంధానం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. మొన్న నియోజకవర్గ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసిన 'అన్నం' తాజాగా నియోజకవర్గ తెలుగు దేశం కార్యాలయంలో సాంకేతిక విభాగాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులతో నిత్యం చర్చించే విధంగా టెలీకాన్పరెన్స్‌ను ప్రారంభించేందుకు ఎస్‌ఎంఎస్‌ కంట్రీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం అధికారులతో టెలీకాన్పరెన్స్‌లతో చర్చిస్తున్నారో అదే బాటలో 'చినబాబు' స్ఫూర్తితో ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాలు, సూచనలతో తాను ఈ విభాగాన్ని ఏర్పాటు చేశానని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. గ్రామస్థాయినుండి మండల స్థాయి వరకు వార్డు నుండి మున్సిపల్‌ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సంస్థల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌తో మాట్లాడే విధానాన్ని త్వరలో ప్రారంబించనన్నుట్లు తెలిపారు. ఈ విధానాన్ని ప్రతిరోజు ఉదయం...అవసరమైతే సాయంత్రం కూడా వాడుకుంటానని తెలిపారు. 

   గ్రామస్థాయిలో పార్టీ కార్యవర్గం, గ్రామ సర్పంచ్‌, పాల కేంద్రం ఛైర్మన్‌, సహకార సంఘ ఛైర్మన్‌,ఎంపిటిసిలతో పాటు ఇతర ముఖ్యులతో టెలీకాన్పరెన్స్‌ ద్వారా సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో ప్రారంభించగా తాను ఈ విధానాన్ని 'బాపట్ల'లో అమలు చేయబోతున్నానని 'అన్నం' చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను కొందరు కార్యకర్తలకు సహాయం చేశామని, మరి కొందరికి త్వరలో చేయబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలో కెల్లా మిన్నగా నిలబెట్టడానికి కష్టపడుతున్నారని, తాను కూడా 'బాపట్ల' నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకే తాను ఈ విధమైన విధానాన్ని ఎన్నుకున్నానని ఆయన తెలిపారు. అంతకు ముందు అన్నం 'చినబాబు'ను స్వయంగా కలసి ఆయన సాంకేతిక పరంగా ఇచ్చిన సలహాలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా 'బాపట్ల' నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా, ఎమ్మెల్సీగా మిగతా నియోజకవర్గల కన్నా నూతనంగా ఉండాలన్న తపన ఎమ్మెల్సీ 'అన్నం'లో స్పష్టంగా కనిపిస్తోంది.

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ