WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు 60ఏళ్లు జైలుశిక్ష పడుతుంది:అన్నం

తప్పుచేసిన వారెవరైనా న్యాయస్థానం ముందు తప్పించుకోలేదని, తగిన శిక్షను అనుభవించాల్సిందేనని, శశికళ ఉదంతమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌ ప్రభాకర్‌' వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 66కోట్లరూపాయల అక్రమాస్తుల కేసులో 'శశికళ'కు నాలుగేళ్లు జైలుశిక్ష విధించగా 10కోట్ల రూపాయలు జరిమానా విధించిందని, వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ప్రతిపక్ష వై.ఎస్‌.జగన్‌కు 60ఏళ్లు జైలుశిక్ష పడ్డా ఆశ్చర్యపోనవసరంలేదని 'అన్నం' అన్నారు. ప్రజలను, యువకులను తాత్కాలికంగా మభ్యపెట్టినా చేసిన నేరాలకు, ఘోరాలకు న్యాయం స్థానం వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరని 'శశికళ' ఉదంతం ద్వారా ఇది స్పష్టమైందని ఇప్పటికైనా 'జగన్‌' తన తీరు మార్చుకోవాలని, ఆధారాలు లేని విమర్శలు చేయవద్దని ఆయన చెప్పారు. 'యువభేరీ' పేరుతోమరోసారి యువకులను మోసగించి, 'జగన్‌' యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని 'అన్నం' సూచించారు. ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవద్దని, బోగస్‌ కంపెనీలను ఎలా స్థాపించారు...వాటి ద్వారా కోట్లు కూటబెట్టింది నిజం కాదా...? అమాయకులైన యువకులను తప్పుదారి పట్టించే పనులను చేయవద్దని, యువత నిజం తెలుసుకుని 'జగన్‌'కు బుద్దిచెబుతారని 'అన్నం' అన్నారు. దోషులు ఎటువంటి వారైనా కోర్టు వేసే శిక్షలను తప్పించుకోలేరని ఇప్పటికైనా అక్రమాస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని 'జగన్‌' సూచించారు. యువభేరీకి హాజరయ్యే విద్యార్థులకు ఏ విధమైన సందేశం ఇస్తారని ఆయన డిమాండ్‌ చేశారు. అనేక అక్రమాస్తుల కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న 'జగన్‌' యువకులకు ఏం ఉద్భోదిస్తారని ప్రశ్నించారు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న 'చంద్రబాబు'పై బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని లేని పక్షంలో ప్రజలు బుద్ది చెబుతారని 'అన్నం' వ్యాఖ్యానించారు. 'శశికళ'ను నిర్థారించి 'సుప్రీంకోర్టు' వేసిన శిక్షను ఆయన సమర్థించారు. భవిష్యత్‌లో 'జగన్‌' కూడా కోర్టు వేసే శిక్షల కోసం ఎదురు చూడాలని 'అన్నం' వ్యాఖ్యానించారు.

(189)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ