WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు జైలు భయం పట్టుకుంది:అన్నం

గుంటూరులో జరిగిన యువభేరీలో యువకుల హాజరు అంతంత మాత్రమేనని, వారిలో స్పందన పెద్దగా లేదని, అధికార దాహమే తప్ప ప్రజా సేవ చేయాలనే తపనకానీ, కోరిక కానీ వై.ఎస్‌.జగన్‌కు లేదని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ దుయ్యబట్టారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'జగన్‌' చెబుతున్న కల్లబొల్లి మాటలను, కపట ప్రేమను ప్రజలు నమ్మడం లేదని ఆయన విమర్శించారు. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఏ మొహంతో ప్రజల ముందుకు ఆయన వస్తున్నారని 'అన్నం' ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుని వాటిని ఎలా రక్షించుకోవాలని తపన పడుతున్నారని కోర్టు కేసులకు హాజరుకావడానికే ఆయనకు సమయం సరిపోవడం లేదని ఆయన ఎగతాళి చేశారు. 12 కేసులో ఎ1 నిందితునిగా ఉన్న 'జగన్‌' తనపై కోర్టులు ఏం తీర్పులిస్తాయో...ఎన్నేళ్లు జైలుశిక్ష పడుతుందో తెలియక టెన్షన్‌ పడుతున్నారన్నారు. 'నాన్నా..అదిగో పులి' సామెతలా...ఒక సంవత్సరం ఆగండి...రెండేళ్లు ఆగండి...తాను సిఎంనుఅవుతా అని పదే పదే బాహాట ప్రకటనలు చేస్తున్నారని ఈ మధ్యలోనే జైలు కెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని 'అన్నం' నిలదీశారు. తన నియోజకవర్గమైన బాపట్ల నుండి 'యువభేరి'సదస్సుకు యువత తక్కువగా హాజరయ్యారని,యువకులకు కూడా 'జగన్‌' తత్వం తెలుసుకుని దీనికి హాజరు కాలేదని యువభేరి సభలో 'చంద్రబాబు'పై విమర్శలు చేయడాన్ని అన్నం తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలు రాష్ట్రానికి వస్తుంటే ఓర్వలేక హోదా ముసుగులో ప్రజలను మభ్యపెట్టేందుకు 'జగన్‌' ప్రయత్నిస్తున్నారని అయితే ఆయన మాటలను ఎవరూ నమ్మరని 'అన్నం' అన్నారు. 

   విభజన అనంతరం రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం బలమైన పునాదులు వేస్తున్న సిఎం చంద్రబాబునాయుడుపై దేశ,విదేశాల ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారని, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కన్నా అంతకు మించిన స్థాయిలోనిధులు రాబట్టేందుకు సిఎం శ్రమిస్తున్నారని 'అన్నం' కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడం,ప్రారంభించడం  వేగంగా జరుగుతుందని పోలవరంనిర్మాణం మరో రెండేళ్లలో పూర్తి కావడం ఖాయమని,త్వరలో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం దేశ,విదేశాల నుండి పెట్టుబడిదారులు క్యూలు కడుతున్నారని, ఎక్కడ చంద్రబాబుకు మరింత పేరు ప్రతిష్టలు లభిస్తాయనే అసూయతో 'జగన్‌' విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆధారాలు లేని విమర్శలు చేస్తే ప్రజలందరూ ఏకమై తరిమికొడతారని 'అన్నం' హెచ్చరించారు. అధికారం దాహమే తప్ప కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సహకరించకుండా ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేయించాలో అని కుట్రలు పన్నుతున్న 'జగన్‌' తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షనాయకుడంటే అవాస్తవిమర్శలు, ఆరోపణలు చేయడానికే ఉన్నారు తప్ప పాలనలో జరిగే తప్పులు ఎత్తిచూపితే ప్రజల కూడా హర్షిస్తారని ఇప్పటికైనా ఆయన వ్యవహారతీరు మార్చుకోవాలని 'అన్నం' సూచించారు.


(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ