WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి ప‌ద‌వుల‌కై గ్రూపులు క‌డుతున్న త‌మ్ముళ్లు...!

ర‌స‌కందాయకంగా గుంటూరు టిడిపి రాజ‌కీయాలు..

రాష్ట్రమంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో గుంటూరుజిల్లాలోని రాజకీయాలు రసకందాయంగా మారాయి.గ్రూపు రాజకీయాలు తెరమీదకొచ్చాయి.మొదటి నుండి ఎన్నో ఏళ్ళుగా ఉప్పు,నిప్పులాగా ఉన్న పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేందకుమార్‌,తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వర్గాలు మంత్రి పదవులు తమకు గాని,తమ వర్గంలోని వారికిగాని దక్కించుకునేందుకు గ్రూపు రాజకీయాలు నెరపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.గుంటూరుజిల్లాలోని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,రావెల కిషోర్‌బాబుకు మంత్రులుగా ఉద్వాసన ఖాయమని వస్తున్న వార్తల కారణంగా వారివారి స్థానాలను ఆక్రమించేందుకు మంత్రులుగా ఈరెండు గ్రూపులు వివిద రూపాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒత్తిడిలను తీవ్రతరం చేశారంటున్నారు.ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తనకే మంత్రిపదవి కావాలని గట్టిగా పట్టుపడుతుండగా,సంగం డైరీ చైర్మన్‌ పదవి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో దానిని వదులుకోవటానికి సిద్ధంగా లేనికారణంగా తనకు కాకపోతే తమ వర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు,వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులకుగాని,తన గ్రూపుకు మద్దతుగా ఉన్న గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుకుగాని,ఎస్సీ సామాజిక వర్గానికైతే తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌కుగాని అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

   కాగాస్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మద్దతుతో మంత్రి పదవి కోసం యత్నాలు చేస్తున్న తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వర్గీయులు మొదటి ప్రాధాన్యతగా కోడెల శివప్రసాద్‌రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని,ఒకవేళ కోడెలను స్పీకర్‌గా కొనసాగింపదలిస్తే తనకు మంత్రిపదవి ఇవ్వాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరుతున్నాడని చెబుతున్నారు.అలా కాకపోయినా తనవర్గంలోని బీసీ వర్గానికి చెందిన రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌కు మంత్రిపదవిని ఇవ్వాలని,ఎస్సీలకు అవకాశం ఇస్తే వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనంద్‌బాబుకు స్థానం కల్పించాలని ప్యానల్‌ పెట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వర్గీయుడుగా ప్రయత్నాలుచేస్తున్న రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఒక మీడియా అధినేత,తెలంగాణాకుచెందిన రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రికి సిఫార్సు చేసి గట్టిగా పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఏది ఏమైన పార్టీలోని గ్రూపులను బ్యాలెన్స్‌ చేసి వ్యూహకర్తగా చంద్రబాబు గుంటూరుజిల్లాలోని నరేంద్ర,ఆలపాటి రాజా వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇచ్చేలా సమీకరణలు,సామాజిక కోణం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలుగుదేశం రాజకీయాలను ఏళ్ళ తరబడి గమనిస్తున్న రాజకీయ విశ్లేషకుల అంచనా.








(2765)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ