WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హిందూ వివాహ బిల్లుకు పాకిస్థాన్ సేనేట్‌ ఆమోదం

హిందూ వివాహ బిల్లుకు పాకిస్థాన్ పెద్ద‌ల స‌భ ఆమోదం తెలిపింది. ఆ బిల్లును పెద్ద‌ల‌స‌భ(సేనేట్‌) ఏక‌గ్రీవంగా ఆమోదించింది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 26న ఈ బిల్లుకు జాతీయ అసెంబ్లీలో ఆమోదం ద‌క్కింది. వ‌చ్చే వారం  ప్రెసిడెంట్ ఆమోదం పొందిన త‌ర్వాత ఈ బిల్లు చ‌ట్టంగా మారుతుంది.  దీంతో పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల‌కు ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం ఇక నుంచి అధికారికంగా వ‌ర్తిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల‌కు ఈ కొత్త చ‌ట్టం వ‌ల్ల ర‌క్ష‌ణ పెర‌గ‌నుంది. పంజాబ్‌, బ‌లోచిస్తాన్‌, ఖైబ‌ర్ ప్రాంతాల్లో ఉన్న హిందువుల‌కు ఇది ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. న్యాయ‌శాఖ మంద్రి జాహిద్ హ‌మిద్ ఈ బిల్లును సేనేట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఎటువంటి వ్య‌తిరేక‌త లేకుండానే బిల్లుకు ఆమోదం ద‌క్కింది.

(311)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ