WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హీరోయిన్ భావన కిడ్నాప్...!

హీరోయిన్ భావనను దుండగులు కిడ్నాప్ చేసారు. . శుక్రవారం రాత్రి  షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆమెను దుండగులు అడ్డగించి ఈ చర్యకు పాల్పడ్డారు. గంటన్నరసేపు కార్లో అటు ఇటు తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం షూటింగ్ ముగించుకుని థ్రిసూర్ నుంచి కోచికి రాత్రి 9.30 గంటల సమయంలో భావన కార్లో వెళుతుండగా ఓ టెంపోలో ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్, ఇతర గుర్తుతెలియని దుండగులు ఫాలో అయ్యారు. అథానీలోని నెదుంబసేరీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దుండగులు ఆమె కారును టెంపోతో ఢీకొట్టారు. ఆమె ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌‌తో కలిసి మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ బలవంతంగా కార్లోకి ఎక్కి.. దాదాపు గంటన్నర పాటు ఆమెపై కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు.. ఫోన్లో ఆమె ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఆమెను బెదిరించారు. తర్వాత వారు పళరివత్తం జంక్షన్ వద్ద దిగిపోయారు. వారు దిగిపోయాక అక్కడికి సమీపంలోనే నివసించే సినిమా నిర్మాత వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరించింది భావన. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భావన కార్ డ్రైవర్‌ మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 

   రెండు నెలల క్రితమే సునీల్ కుమార్ ఈ కిడ్నాప్ ప్లాన్ వేశాడని తెలిపారు. ఏదో విషయంలో గొడవ జరిగి సునీల్‌ను భావన తీసేయడం వల్లే ఆమెపై సునీల్ కక్ష పెంచుకున్నాడని, ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌తో జతకట్టి పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. శనివారం ఉదయం అంగామలిలో మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు సునీల్ కోసం గాలింపు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అనంతరం ఎర్నాకులం మెడికల్ కాలేజీలో భావనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆ దాడిలో భావనకు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. సునీల్ కుమార్‌కు ఇదివరకే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

(757)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ