WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాపం...నాగార్జున...!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జునల కాంబినేషన్‌లో వచ్చిన ఆణిముత్యాలు 'అన్నమయ్య', శ్రీరామదాస్‌, చిత్రాలు...! భక్తిరస చిత్రాలను రూపొందించడంలో 'రాఘవేంద్రరావు, వాటిలో నటించడంలో 'నాగార్జున'లను మించిన వారు లేరని ఆయా చిత్రాలు రుజువు చేశాయి. ఆ జోనర్‌లో నటించాలంటే వారిద్దరే అన్నంత పేరు కూడా వచ్చింది. దాంతో అటువంటిదే మరో చిత్రం తీయాలని వీరిద్దరూ భావించి 'నమో వేంకటేశాయ' చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. చిత్రం రిలీజ్‌ అయిన తరువాత సినీవర్గం నుంచి రాఘవేంద్రరావుకు, నాగార్జునలకు ప్రశంసలు దక్కాయి. 'నాగార్జున' నటన అదిరిపోయిందని, మరో 'అన్నమయ్య' అవుతుందని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడిపోయింది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 'అన్నమయ్య'వలే ఉంటుందన్న ప్రచారం ఈ చిత్రాన్ని దెబ్బకొట్టింది. కృత్రిమమైన నటన, ఏదో సాధించాలనే ఆలోచన తప్ప దానిలో సహజసత్వం లేదని ఎక్కువ మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. దాంతో 'నాగార్జున' ఎంత బాగా నటించినా...ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్‌ కాలేకపోయింది. చిత్రం విడుదలైన తొలిరోజు 'నాగార్జున' ఈ చిత్రం కూడా తన కెరీర్‌లో ఓ మైలు రాయిలా మిగిలిపోతుందని అంచనా వేసుకున్నారు. అయితే ఆ తరువాత రోజు నుంచి సడన్‌గా కల్షెన్లు తగ్గడం మొదలైంది. అది చివరకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయిందట. దీంతో 'నాగార్జున' చాలా అప్‌సెట్‌ అయ్యారట. రెండురోజుల పాటు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండిపోయారట. ఫోన్‌ కూడా లిప్ట్‌ చేయకుండా మౌనం పాటిస్తున్నారట. ఎందుకు ఇలా జరిగిందని ఆయన మదనపడుతున్నారట. మొత్తం మీద ఇక మీద తెలుగులో భక్తిరస చిత్రాలను తీసే ధైర్యం ఎవరూ చేయలేరేమో...!


(472)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ