WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తా :ప‌వ‌న్

చేనేత కార్మికల కష్టాలు తనకు తెలుసనీ, వారంటే తనకు ఎంతో గౌరవమని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు, వస్త్రాలిచ్చే చేనేత, దేశరక్షణ చేసే జవాన్లంటే తనకు ఇష్టమన్నారు. తాను చేనేత బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఉండటానికి ఇష్టపడతానని అన్నారు. ఈ విషయమై కొందరు తనను హేళన చేశారని, వడ్డించే వాళ్లను కాకుండా విస్తరాకులు ఏరుకునే వారికి చేస్తే ఏమి వస్తుందని ఎద్దేవా చేశారని అన్నారు. ఎంగిలాకులు ఏరుకునే వారని అనడం సరైంది కాదని, తాను చేనేతలకు అండగా నిలబడతానికే ఇష్టపడతానని అన్నారు. వారానికి ఒకసారైనా ప్రజలంతా చేనేత బట్టలు కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 2019లో తాను ఎన్నికల్లో పోటీచేసి శాసనసభలో చేనేత గొంతు వినిపిస్తానని అన్నప్పుడు సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి.

    పదవుల కోసం తాను రాజకీయాలలోకి రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో చేనేత సత్యాగ్రహ సభలో మాట్లాడుతూ ఆయన సామాజిక న్యాయం కోసమే రాజకీయాలలోకి వచ్చానన్నారు. ప్రభుత్వాలు ఎవరికైతే అండగా నిలబడవో…వారి పక్షాన తాను న్యాయం కోసం పోరాడతానని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ప్రజాసేవకు అధికారం అవసరం లేదని పేర్కొన్నారు.లక్షలాది మంది ప్రజల పొట్ట కొడుతున్న వ్యాపారులను కట్టడి చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేతల బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతిమగ్గాల మీదే నేయాలన్నారు. పవర్‌లూమ్స్‌ వల్ల ఆ పని కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు.

   క్రికెట్‌, టెన్నిక్‌ క్రీడాకారులకు ఇచ్చినట్లే.. చేనేత కళాకారులకు నగదు ప్రోత్సహకాలివ్వాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేతల బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. చేనేత కళాకారుల వ్యక్తిగత నైపుణ్యాన్ని ప్రోత్సహించేలా నగదు బహుమతులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వాల హామీల అమలుపై చేనేత సంఘాలు పర్యవేక్షణ కమిటీ వేసుకోవాలన్నారు.కార్పొరేట్‌ కంపెనీలకు తాను అంబాసిడర్‌గా ఉంటే తనకు కోట్లు వస్తాయి కానీ.. వీరి కష్టాలు తీరవనే తాను చేనేతల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నాన్నారు.

    చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటే హేళన చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. తనను ఎంగిలాకులు ఎత్తుకునే వాడిగా అవహేళన చేశారని చెప్పిన పవన్ తనను వారితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. శుభ్రం చేసే వారు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సంగతిని ఒక్క సారి ఊహించుకోవాలని తన విమర్శకులను కోరుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.సత్యాగ్రహం అంటే నిజం తాలూకు కోపం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతులు, చేనేత కళాకారులు, జవాన్లు అంటే తనకు ఎంతో అభిమానమన్నారు.  చేనేతను గౌరవించడమంటే దేశ సంస్కృతిని గౌరవించడమేనని పవన్ అన్నారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తి అని చెప్పారు. కమర్షియల్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంలో ఆత్మ సంతృప్తి లేదన్నారు.

    చేనేతల ఐక్య గర్జనకు హాజరైన పవన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఎర్ర కండువా స్వీకరించి మెడలో వేసుకున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆ ఎర్ర కండువా ఖచ్చితంగా ఉండాల్సిన అలంకరణగా మారిపోయింది. దీన్ని గుర్తించిన నిర్వాహుకులు ఆయనకు దాన్ని అందించారు. ప్రసంగం మధ్యలో ఆయన ఎర్ర కండువా గురించి మాట్లాడుతూ.. ఇది సామాన్యుడి శక్తి అని, దీనికి కులం, మతం లేదని అన్నారు. నేను గబ్బర్ సింగ్‌ను కానని, తాను సామాన్యుడినని తన మెడలో ఉన్న ఆ ఎర్ర కండువాని చేతితో పట్టుకుని చెప్పారు పవన్ కళ్యాణ్.దోపిడీ ఆపటానికి వింగ్ ఏర్పాటు చేయండి సత్యాగ్రహం ఆగ్రహం కాకూడదు.ఏ మాట అయితే చెప్పారో అది అమలు చేయాలి ప్రభుత్వ వాగ్ధానాలు ఏ విధంగా అమలవుతున్నాయో ఓ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయండి క్రీడా కారులకు నగదు లరోత్సాహకాలు ఇస్తాం కానీ మన ఒంటినే కప్పే చేనేత వస్త్రాలు తయారు చేసే వారికేవీ పవన్ సి ఎం అంటూ,అభిమానుల నినాదాలు రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదంటూ పవన్ సమాధానం.సామాజిక సేవా కోసమే వచ్చా

2019 లో ఖచ్చితంగా పోటీ చేస్తా

చేనేత కార్మికులకు జనసేన అండగా ఉంటుంది.మన పంచ,మన కట్టు,బొట్టు మర్చి పోవద్దు.నేను సామాన్యుడని ఇది సామాన్యుడిది.మన నేతన్న నేసినది వారానికి ఒక్క సారి చేనేత వస్త్రాలు వాడండి.శీతల పానీయాలు త్రాగమని నేను చెప్పను అన్నం పెట్టె రైతు,బట్ట నేసె చేనేత కార్మికుడు కన్నీరు పెడితే దేశం సుభిక్షంగావుండదు. కష్టాలు వచ్చినప్పుడే దమ్ము తెలుస్తుంది అటువంటి కష్టాలు ఎదుర్కొనే వాళ్ళే నా పార్టీ కార్యకర్తలు చెప్పి,చెప్పి,చెప్పి,చెప్పి,ఎంత కాలం ప్రజల్ని మోసం చేస్తారు. 

(505)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ