WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'గా 'చిరంజీవి'...!

దాదాపు తొమ్మిదేళ్ల తరువాత రీ ఎంట్రీ సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టిన మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు చారిత్రాత్మకమైన చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి 'ఖైదీనెం.150'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'చిరంజీవి'తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. అంతే కాకుండా తొలిసారి వందకోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డు సృష్టించారు. దీంతో ఇక వరుసగా సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నారు. తన 151వ సినిమాగా చారిత్రక నేపథ్యం ఉన్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని ఆయన ఎంచుకున్నారట. ఈ చిత్రానికి ఆయన తనయుడు 'రామ్‌చరణ్‌' నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. 'ఖైదీనెం.150'కి నిర్మాతగా ఉన్న 'చరణ్‌' ఇప్పుడు ఈ సినిమా కూడా తానే నిర్మించబోతున్నారట. అంతే కాకుండా ఈ చిత్రప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో చేయాలని 'మెగా' క్యాంప్‌ ఆలోచిస్తుందట. వాస్తవానికి 'ఖైదీనెం.150' చిత్ర విజయోత్సవాన్ని భారీగా జరపాలని వారు భావించారు. అయితే అనుకోని కారణాలవల్ల అది వాయిదా పడింది. దీంతో 'చిరంజీవి' 151 చిత్ర ప్రారంభోత్సవానికి భారీగా జరపబోతున్నారట. ఈ చిత్రం మే మాసంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి 'మెగాస్టార్‌' ఇలా వరుసగా సినిమాలు చేయడం ఆయన అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.


(539)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ