మెగా ఫ్యామిలీలో తొలి హీరోయిన్ 'నిహారిక' తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టం పరీక్షించుకోబోతోందట. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం 'ఒక మనసు' ప్లాప్ అవటంతో...తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని భావిస్తోందట. 'ఒక మనసు' చిత్రంలో 'నిహారిక' నటనకు మంచి మార్కులే పడినా చిత్రం విజయం సాధించకపోవడంతో ఆమె తన కెరీర్‌ను మెరుగుపరుచుకునేందుకు తమిళ సినిమాల వైపు చూస్తుందట. దీనిలో భాగంగా ఆమె తమిళ హీరో 'విజయ్‌సేతుపతి'తో కలసి ఓ సినిమా చేస్తుందట. ఈ సినిమా షూటింగ్‌కు 'నిహారిక' రెగ్యులర్‌గా హాజరవుతోందట. ఈ సినిమానే కాకుండా మరిన్ని తమిళ సినిమాలు చేయాలని 'నిహారిక' ప్లాన్ చేసుకుంటుందట. తెలుగులో తొలి సినిమానే పరాజయం పాలవడంతో ఆమె తెలుగు సినిమాల వైపు చూడకుండా ప్రస్తుతం పరభాషా చిత్రాలు చేయడానికే మొగ్గుచూపుతుందట. మరి మెగా ఫ్యామిలీ హీరోయిన్‌కు అక్కడైనా విజయం దక్కుతుందో లేదో వేచి చూడాలి మరి...!
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ