WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.99/-కే జియో ప్రైమ్ ప్రత్యేక ప్లాన్‌

వెల్‌క‌మ్ ఆఫ‌ర్ల‌లో ఉన్న సౌక‌ర్యాల‌న్నీ ఇక‌పై నెల‌కు రూ.303 రీఛార్జ్‌తో ఏడాది పాటు అందుకోవ‌చ్చని రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. త‌మ‌ జియో యూజ‌ర్ల‌ సంఖ్య ప‌ది కోట్ల‌కు చేరిన సంద‌ర్భంగా రిల‌య‌న్స్ అధినేత ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ విజ‌యం ప్ర‌తి వినియోగ‌దారుడి సొంతమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జియో వినియోగ‌దారుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. వెల్‌క‌మ్ ఆఫ‌ర్ల‌లో ఉన్న సౌక‌ర్యాల‌న్నీ ఇక‌పై నెల‌కు రూ.303 రీఛార్జ్‌తో ఏడాది పాటు అందుకోవ‌చ్చని తెలిపారు. త‌మ వినియోగ‌దారుల‌కు 24 గంట‌లూ అత్యుత్త‌మ సేవ‌ల‌ను అందించ‌డమే త‌మ‌ ల‌క్ష్యమ‌ని చెప్పారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే 10 కోట్ల మంది జియో యూజ‌ర్ల‌ను సొంతం చేసుకోవడం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

  ఉచితంగా అప‌రిమిత కాల్స్, డేటాను అందిస్తూ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన‌ రిలయ‌న్స్ జియో.. ఊహించ‌ని రీతిలో వినియోగ‌దారులను సంపాదించుకున్న విష‌యం తెలిసిందే.. ఈ ఏడాది ఒక్క‌ జ‌న‌వ‌రి నెల‌లోనే వంద కోట్ల జీబీ డేటాను వాడిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అంతేకాదు, మొబైల్ డేటా వాడ‌కంలో ప్ర‌పంచంలోనే మ‌న‌దేశం అగ్ర‌స్థానంలో ఉంద‌ని ఆయ‌న అన్నారు.గ‌త 170 రోజులుగా సెక‌నుకు ఏడుగురు క‌స్ట‌మ‌ర్లు జియో యూజ‌ర్లుగా మారార‌ని చెప్పారు. జియో నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌తి రోజూ 5.5 కోట్ల గంట‌ల వీడియోను చూస్తున్నార‌ని అన్నారు. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా దేశంలోని 99 శాతం జ‌నాభాను జియో క‌వ‌ర్ చేస్తుంద‌ని ముఖేష్ అంబానీ ధీమా వ్య‌క్తం చేశారు. రూ.99 కే జియో ప్రైమ్ మెంబర్ షిప్‌ను మార్చి 1 నుంచి ప్రారంభించ‌నున్నారు. రూ.99కే ఏడాది సభ్యత్వం ఇవ్వ‌నున్నారు.

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ