లేటెస్ట్

సిఎంఒలోకి 'సాల్మాన్‌ ఆరోక్యరాజ్‌'

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కార్యాలయంలోకి మరో అధికారిని నియమించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్‌ కార్యదర్శిగా పనిచేస్తోన్న 'సాల్మాన్‌ ఆరోక్యరాజ్‌'ను సిఎంఒ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం సిఎం అదనపు కార్యదర్శిగా 'ధనుంజయరెడ్డి'ని నియమించిన ప్రభుత్వం ఇప్పుడు మరో అధికారిని సీఎంఓలోకి తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా 'సాల్మాన్‌' సిఎంఓలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఇండస్ట్రీస్‌ శాఖ కార్యదర్శి పదవిని కూడా ఆయనే నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న 'షంషేర్‌సింగ్‌ రావత్‌'ను 'ఆర్థికశాఖ' కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. 

డీజీపీగా 'గౌతమ్‌సవాంగ్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 'గౌతమ్‌సవాంగ్‌'ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న 'ఆర్‌.పి.ఠాగూర్‌'ను ప్రింటింగ్‌, స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది. ఆ స్థానంలో పనిచేస్తోన్న 'త్రిపాఠీ'ని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయమని ఆదేశించింది. మరో వైపు ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ 'విశ్వజిత్‌'ను నియమించింది. 

(707)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ