WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టెలినార్ ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్

నార్వేకు చెందిన టెలినార్ ఇండియా యూనిట్‌ను దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వ‌ర్క్  ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది.. దీని ద్వారా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో టెలినార్ ఆప‌రేష‌న్స్ హ‌క్కులు ఎయిర్‌టెల్ సొంతం కానున్నాయి. గ‌తేడాది జియో ఎంట్రీతో మిగ‌తా టెలికాం ఆప‌రేటర్ల గుండెల్లో గుబులు మొద‌లైన విష‌యం తెలిసిందే. కొంద‌రు త‌మ రేట్ల‌ను కూడా భారీగా త‌గ్గించ‌గా.. మ‌రికొన్ని పెద్ద ఆప‌రేట‌ర్లు ఇలా చిన్న‌చిన్న వాటిని త‌మ‌లో క‌లిపేసుకోవ‌డానికి మొగ్గు చూపుతున్నాయి. గ‌త అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ లాభాలు భారీగా క్షీణించ‌గా.. మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా న‌ష్టాల బారిన ప‌డింది.

దీంతో జియోకి చెక్ పెట్ట‌డానికి ఇప్ప‌టికే వొడాఫోన్‌ను త‌మ‌లో విలీనం చేసుకోవ‌డానికి ఐడియా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ కూడా ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. టెలినార్ ఇండియా యూనిట్‌ను వ‌దులుకోవ‌డం అంత సులువుగా తీసుకున్న నిర్ణ‌యం కాదు. అయితే ఈ పోటీలో అది కొనసాగాలంటే భారీ పెట్టుబ‌డులు అవ‌స‌రం అని టెలినార్ గ్రూప్ సీఈవో సిగ్వె బ్రెక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టెలినార్‌ను కొనుగోలు చేసింద‌న్న వార్తల‌తో భార‌తీ ఎయిర్‌టెల్ షేర్లు 5.5 శాతం లాభ‌ప‌డ‌టం విశేషం. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసింద‌న్న‌ది మాత్రం ఎయిర్‌టెల్ వెల్ల‌డించ‌లేదు

(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ