లేటెస్ట్

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు...!

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఎఎస్‌లను బదిలీ చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం తన ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులను బదిలీ చేసింది. దాదాపు 43 మంది ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల కార్యదర్శులను, ఎండిలను, కమీషనర్‌లను స్థానాలను మార్చింది. టిడిపి ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు సీనియర్‌ అధికారులను పక్కన పెట్టింది. అదే సమయంలో వారికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారుల్లో మెజార్టీ ఐఎఎస్‌లకు పోస్టింగ్‌ దక్కలేదు. టిడిపి ప్రభుత్వంలో ప్రాధాన్యత లేని శాఖల్లో పనిచేసిన వారికి ఈ బదిలీల్లో మంచి పోస్టులు దక్కాయి. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'జె.ఎస్‌. వి.ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌దాస్‌, రజిత్‌భార్గవ, జి.అనంతరాము, కె.ప్రవీణ్‌కుమార్‌, రామ్‌ప్రకాష్‌ శిషోడియా, బుడితి రాజశేఖర్‌, టి.కృష్ణబాబు, దమయంతి, జె.శ్యామలరావు, బి.శ్రీధర్‌, కోన శశిధర్‌, కె.ఆర్‌.ఎం.కిశోర్‌కుమార్‌,(ఐపిఎస్‌) మధుసూధన్‌రెడ్డి (ఐఎఫ్‌ఎస్‌)పియూష్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, గిరిజాశంకర్‌, పి.లక్ష్మీనర్సింహ్మం, జె.మురళీ,పి.భాస్కర,మురళీధర్‌రెడ్డి, శేషగిరిబాబు తదితరులకు ప్రాధాన్యత కలిగిన పోస్టులు లభించాయి. 

(787)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ