WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిప్పులాంటి అధికారిపై ఆరోపణలా...?

ఆయన నిజాయితీపరుడైన ఐఎఎస్‌ అధికారి. ఇన్నేళ్ల సర్వీసులో ఆరోపణలు, విమర్శలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ అధికారి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా రెండున్నేర్లకు పైగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ భాస్కర్‌ అధికార అవినీతికి అడ్డుపడుతుండడంతో ఉద్యోగులకు, అధికారులకు మింగుడుపడడం లేదు. ఆయనను ఏదో విధంగా అపఖ్యాతిపాలు చేసేందుకు రాజకీయ నాయకులు కొందరు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఆయన పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తారు...పనిచేయని వారి భరతం పడతారు. ఇటీవల ఆయన కొందరు ఉద్యోగులను అవమానించారని జరుగుతున్న ప్రచారంపై ఆయన బాహాటంగా స్పందించారు. సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులను, అధికారులకు ఆయన ప్రోత్సహించారు..వాటితో పాటు రివార్డులు కూడా ఇచ్చారు.  ఉద్యోగులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండి వారి కోసం పనిచేయాలి...అంతే కానీ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో విమర్శలు, ఆరోపణలు చేయకూడదు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టం తనపని తాను చేసుకుపోతోంది. తనకు ఏ ఒక్కరిపై కోపం లేదని, కలెక్టర్‌గా విధుల్లో చేరి రెండున్నరేళ్లుపైగా అయింది...ఇంత వరకు తాను టిఎ,డిఎలు కూడా తీసుకోలదని ఆయన చెప్పారు. రెవిన్యూ ఉద్యోగసంఘ నాయకులు అవాస్తవ విమర్శలు చేస్తున్నారు. కోర్టు  ఆదేశాలు మేరకే పలువురు తాసిల్దార్లకు షోకాజ్‌నోటీసులు ఇచ్చాం. అందులో కొందరు మాత్రమే జవాబులు ఇచ్చారు... మరి కొందరు ఇవ్వలేదు...తనకు ఏ ఒక్కరి పేరు చెప్పడం ఇష్టం లేదన్నారు.కేవలం వ్యక్తిగత పనులు కావడం లేదనే తనపై విమర్శలు చేస్తున్నారని...తాను తన తల్లిదండ్రులకు సేవలు చేయడంలేదని విమర్శలు చేస్తున్నారు. వారి పేరు ఎత్తే అర్హత వీరికి లేదు..తాను ఎటువంటి సేవలు తన తల్లిదండ్రులకు చేస్తున్నానో వారికి తెలుసు. 

  ఉద్యోగ సంఘాల నాయకులు హుందాగా మాట్లాడాలి...తనకు కష్టపడి, నిజాయితీగా పనిచేయడమే తెలుసునని...సంక్షేమపథకాల ఫలాలను బడుగు,బలహీనవర్గాల ప్రజలకు అందజేయడమే తన బాధ్యత అని..ఏ ఒక్కరిపై కక్ష లేదని తాను తాసిల్దార్లను అవమానిస్తూ మాట్లాడాననడం అవాస్తవం. వారు చేసిన తప్పులను ఎత్తిచూపి సరైన మార్గంలో నడపాలనేది తన ఆశ అని, సమీక్షా సమావేశాలు జరిగినప్పుడు ఎన్ని ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో అడగడం తన విధి అని...ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పడం తాసిల్దారు విధి అని ఆయన అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఎన్‌జిఓ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదు. సక్రమంగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తే దానిపై వేరే విధంగా విమర్శలు చేయడం సరికాదు. వ్యక్తిగత స్వార్థంతో రాజకీయ వర్గాల ప్రోద్బలంతో ఎవరెవరు విమర్శలు చేస్తున్నారో తనకు తెలుసనని అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌ భాస్కర్‌ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావడంలో చేసిన కృషిని గురించి అభినందిస్తూ  ఆయన రాత్రిబంవళ్లు కష్టపడి పనిచేశారని, ఆ పార్టీని పూర్తి చేయడంలో ఆయన కలెక్టర్‌గా కాకుండా సామాన్య వ్యక్తి వలే పూర్తి చేశారని ఆయన కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు ఆయనే జిల్లా కలెక్టర్‌గా ఉంటారని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారు. అటువంటి అధికారిని దెబ్బకొట్టేందుకు కొందరు రాజకీయనాయకులు ఉద్యోగులు,అధికారులను పావులుగా వాడుకుంటున్నారని ఆ వర్గాలకు చెందిన వారే చెబుతున్నారు. నిజాయితీపరుడైన అధికారి సేవలు, అటు రాజకీయవర్గాలకు, ఇటు ఉద్యోగవర్గాలకు అవసరం లేదేమో...!


(472)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ