WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కిమ్ సోద‌రుడు నామ్ మృతిపై అనుమానాలు...!

ఉత్తరకొరియా నియంత‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌జోంగ్‌ నామ్  మృతిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆయ‌న‌ను కొంద‌రు హ‌త్య చేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవల కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో  ఆయ‌న హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. నామ్‌పై అధిక మోతాదులో విష ప్రయోగం జరిగిందని, అది జరిగిన 15-20 నిమిషాల్లోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు. కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఆయన ముఖంపై వీఎక్స్‌ విషపదార్థాన్ని పూసిన కేసులో ఇప్పటికే మలేషియా పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టుచేశారు. దీనిపై ఆరోగ్య మంత్రి సుబ్రమణియం శతశివం మాట్లాడుతూ.. అధిక మోతాదులో వీఎక్స్‌ విషాన్ని ప్రయోగించడంతో తొలుత గుండె, వూపిరితిత్తులు ప్రభావితమయ్యాయనీ, ఆ తర్వాత క్రమేణా శరీరం మొత్తం విషం వ్యాపించడంతో ఆయన మృతిచెందినట్టు వివరించారు.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ