WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వై.ఎస్ కుటుంబానికి ఎదురు దెబ్బ‌....!

వై.ఎస్ కుటుంబానికి పెట్ట‌ని కోటగా ఉన్న క‌డ‌ప జిల్లాలో తొలిసారిగా  ఆ కుటుంబానికి ఎదురు దెబ్బ త‌గ‌ల‌బోతోందట‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వై.ఎస్ కుటుంబం ఓడిపోతుంద‌ని జిల్లాకు చెందిన రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెపుతున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు కూడా గ‌ట్టిగా చెబుతున్నారు.  మొత్తం 824 ఓట్లు ఉన్న క‌డ‌ప‌లో టిడిపికి 420 ఓట్లు ఉన్నాయి. వైకాపాకు 380 ఓట్లు ఉన్నాయి. కొంద‌రు క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డ్డా టిడిపి సులువుగా గెలుస్తుంద‌ని వారు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి గంటా కూడా బ‌లంగా చెబుతున్నారు.  వైఎస్‌ కుటుంబాన్ని తొలిసారి ఓడించబోతున్నామని గంటా శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి ఆయన కడపకు వచ్చారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్‌ రవిని పోటీలో నిలబెట్టామని అతనే గెలుస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు తమ ప్రబుత్వం పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.

(2136)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ