WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జ‌యంత్,ఇషాంత్‌లు వ‌ద్దు...!

మొదటి టెస్టులో ఘోర ఓట‌మితో భార‌త్ జ‌ట్టుపై విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. జ‌ట్టు ఓట‌మితో ఆట‌గాళ్ల‌ను మార్చాల‌ని మాజీ ఆట‌గాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జ‌యంత్ యాద‌వ్, ఇషాంత్‌ల‌ను జ‌ట్టునుండి తొల‌గించాల‌ని వారు కోరుతున్నారు. మాజీ ఆట‌గాడు అజారుద్దీన్ వారిని తొల‌గించాల‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. ‘‘పుణెలో ఆట తీరును బట్టి అదనపు బ్యాట్స్‌మన్ అవసరం. జయంత్ యాదవ్ స్థానంలో కరుణ్ నాయర్‌ను తీసుకుంటారని ఆశిస్తున్నాన’’ని చెప్పాడు. లంబూపై కూడా అజహర్ పెదవి విరిచాడు. ‘‘ఇషాంత్ శర్మ బౌలింగ్ కూడా ప్రభావం చూపడం లేదు. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ వంటి స్వింగ్ బౌలర్‌ను విరాట్ జట్టులోకి తీసుకోవాల’’ని సూచించాడు. బ్యాటింగ్‌కు అనుకూలం కాని పుణె పిచ్‌పై భారత్ స్పిన్నర్ల బౌలింగ్ తీరునూ ఆక్షేపించాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా గురించి ప్రస్తావించాడు. సిరీస్ కోల్పోయినట్లు భావించడం లేదని, ఎటువంటి పిచ్‌పై ఆడుతున్నామన్నది చూడాలని చెప్పాడు.

(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ