WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'పై బురద జల్లడమే 'ముద్రగడ' లక్ష్యమా...?

కాపు ఉద్యమం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లేందుకే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభవం లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపు జాతి రిజర్వేషన్‌ కోసం చివరి వరకు పోరాడుతున్నానని చెబుతున్న నీవు...అంతకు ముందు రిజర్వేషన్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేయడానికి 'అన్నం' ఖండించారు. 'ముద్రగడ' చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు కాపుజాతికి కీడు చేస్తున్నాయే తప్ప మేలు చేయడం లేదని ఆయన అన్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించింది ఎవరో ముద్రగడకు తెలియదా...? ఒక వైపు కాపులకు రుణాలు అందుతున్నాయని చెబుతున్న 'ముద్రగడ' మరో వైపు 'చంద్రబాబు'పై విమర్శలు చేయడంలోని పరమార్థం ఏమిటి...? కాపు జాతి అభ్యున్నతి కోసం ఆ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, అందుకే కమీషన్‌ను కూడా నియమించారని విషయం 'ముద్రగడ'కు తెలిసినా...ముఖ్యమంత్రిని టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని అన్నం ఆరోపించారు. తాను చెడిందే కాక వనమంతా చెరిసే విధంగా రాజకీయ తాబేదారుగా 'ముద్రగడ' వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వం విష ప్రచారం చేస్తూ జాతివైషమయ్యాలను పెంచుతున్నారని, సత్యాగ్రహాలు, రాస్తారోకోలు పేరిట ఆయన ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని 'అన్నం' ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 'ముద్రగడ' వ్యవహారశైలిని కాపు సామాజికవర్గం ఖండిస్తుందని, వారంతా ఏకమైన ఆయన కుట్రలను బయటపెట్టేరోజులు ఎంతో దూరంలో లేవని 'సతీష్‌' అన్నారు. చెరపకరా...చెడేవు అనే విధంగా 'ముద్రగడ' భవిష్యత్‌ ఏమిటో స్పష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు మేలు చేసే ఉద్దేశ్యం ఏ మాత్రం లేకుండా ప్రభుత్వాన్ని, సిఎంను విమర్శించడమే పరమావధిగా 'ముద్రగడ' వ్యవహరిస్తున్నారని ఇదే విధంగా వ్యవహరిస్తున్న ఆయనను ఏ విధంగా సంబోధించాలో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.


(415)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ