WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాపం అనుష్క‌...!

సినిమాలో త‌న పాత్ర‌కు న్యాయం చేసేందుకు ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డే హీరోయిన్ల‌లో ముందుంటుంది క‌ధానాయక అనుష్క‌. సైజ్ జీరో కోసం ఆమె సుమారుగా 30 కేజీలు పెరిగింది. ఆ సినిమా హిట్ కాక‌పోయినా ఆమె ప‌డ్డ శ్ర‌మ‌కు సినీ వ‌ర్గాల నుంచి ప్ర‌శంశ‌లు భారీగానే ద‌క్కాయి. అయితే ఆ సినిమా కోసం పెరిగిన బ‌రువు ఆమెకు ఇప్పుడు క‌ష్టాలు తెచ్చిపెడుతున్నాయి.  సరే జయాపజయా లు సర్వసాధారణం అని సరిపెట్టుకుంటే, పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఇంజి ఇడుప్పళగి చిత్రానికి ముందు అనుష్కలా నాజూగ్గా మారలేకపోయింది. ఇది తన తదుపరి చిత్రానికి పెద్ద సమస్యగా మారింది. ఈ ముద్దు గుమ్మ రాజమౌళి వెండితెరపై చెక్కిన బాహుబలి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌ కూడా ఏప్రిల్‌ 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్, మోషన్ టీజర్‌లు ఇప్పటికే విడుదలై విశేష స్పందన పొందుతున్నాయి.అయినప్పటికీ చిత్ర మెయిన్  ట్రైలర్‌ విడుదల కాలేదు. ఇందుకు కారణం అనుషే్కనట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి అంగీకరించినట్లు మీడియా ప్రచారం. అనుష్క బాహుబలిలో కనిపించిన రూపానికి, రెండో భాగంలో కనిపించిన రూపానికి చాలా తేడా ఉండడంతో ఆమె నటించిన సన్నివేశాలకు అధికంగా వీఎఫ్‌ఎక్స్‌ అవసరమైదట. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెరిగిన బరువును అనుష్క పూర్తిగా తగ్గంచుకోలేకపోవడంతో వీఎఫ్‌ఎక్స్‌ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడాల్సి వచ్చిందట.

(232)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ