లేటెస్ట్

'జగన్‌'ను హెచ్చరించిన 'బిజెపి'...!

ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా పాలకులకు బిజెపి పెద్దల నుంచి అప్పుడే హెచ్చరికలు వచ్చాయి. 'రంజాన్‌' సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 'ఇఫ్తార్‌' విందు ఏర్పాటు చేయడంపై బిజెపి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతానికి సంబంధించిన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం ఏమిటని..బిజెపి రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌. నర్సింహ్మారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో 'చంద్రబాబు' ఇలానే ప్రభుత్వ సొమ్ములు మత కార్యక్రమాలకు ఖర్చు చేశారని, ఇప్పుడు 'జగన్‌' కూడా అదే చేస్తున్నారని..ఇది మొదటిసారి కనుక...చూసీ చూడనట్లు వదిలేస్తున్నామని.. మరోసారి అలా జరిగితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే బిజెపి నుంచి ఇటువంటి హెచ్చరికలు రావడంపై వైకాపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

అనాది నుంచి ఉందే...!

బిజెపి పెద్దలు ఇప్తార్‌ విందుపై విమర్శలు చేయడం విడ్డూరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..ప్రభుత్వం తరుపున ఇప్తార్‌ విందులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అనాదిగా ఇటువంటి ఆచారాన్ని ప్రతి ముఖ్యమంత్రి పాటిస్తూనే ఉన్నారు. గతంలో ఏ పార్టీకి చెందిన వారు ముఖ్యమంత్రిగా ఉన్నా..'ఇఫ్తార్‌' విందులు ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణలోనూ..ప్రతి ఏడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 'ఇఫ్తార్‌' విందు ఇస్తున్నారు. మరి తెలంగాణలో ఎప్పుడూ మాట్లాడని బిజెపి పెద్దలు..ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటో...? ముఖ్యమంత్రి జగన్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే ఇటువంటి అర్థం లేని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా..? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద..చూస్తే..బిజెపి ఎంపి చేసిన వ్యాఖ్యలు వైకాపా నాయకులకు కంపరం పుట్టిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో బిజెపితో వైకాపా ఎలా వేగుతుందో చూడాల్సి ఉంది. 

(467)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ