WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విడాకుల త‌రువాత రెచ్చిపోతున్న అమ‌లాపాల్...!

భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌రువాత వ‌రుసుగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది న‌ల్ల‌పిల్ల అమ‌లాపాల్. కుటుంబ జీవితానికి దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు అందాల‌ను ఆర‌బోస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఆ మ‌ధ్య స‌హ‌న‌టుడు ధ‌నుష్ తో ఎఫ‌ర్ న‌డుపుతుందంటూ వార్త‌లు వ‌చ్చినా...ఇప్పుడు త‌న దృష్టి అంతా సినిమాల‌పైనే అని అవ‌న్నీ అబద్దాల‌ని తేల్చి చెప్పింది. కేవలం హీరోయిన్‌గా మరికొంతకాలం రాణించేందుకే భర్త నుంచి దూరమయ్యానని క్లారిటీ ఇచ్చిన ఈ అందాల భామ... భర్త నుంచి విడిపోయిన తరువాత వరుస సినిమాలు సైన్ చేసింది. అందులో కన్నడ మూవీ హెబ్బులి ఒకటి.సుదీప్ హీరోగా నటించిన ఈ నయా మూవీ కొద్ది రోజుల క్రితమే ఆడియెన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అమలా పాల్ రోల్ చూసిన వారంతా అమ్మడు ఇందుకోసమేనా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారట. ఈ సినిమాలో ఓ డాక్టర్‌గా కనిపించిన అమలా పాల్ ఎక్కువగా పాటలకు మాత్రమే పరిమితమైందట. అందులో ఆ పాటల్లో అమలా పాల్ డ్రెస్సింగ్ చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు.గ్లామర్ షో చేస్తున్నానని చెప్పడానికే అన్నట్టుగా ఈ పాటల్లో బాగా పొదుపైన కాస్ట్యూమ్స్ వేసుకుంది అమలా పాల్.. పెళ్లికి ముందు కూడా అమ్మడు ఈ రేంజ్‌లో కనిపించలేదని, మరీ ఇప్పుడు ఇలా రెచ్చిపోతోందేమిటని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరైతే రీ-ఎంట్రీలో అమలా పాల్ తనకు నచ్చిన తీరులో కనిపిస్తోందని గుసగుసలాడుకుంటున్నారు.

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ