WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సాదాసీదా...క‌మ‌ర్షియ‌ల్...గుంటూరోడు...!

మోహ‌న్‌బాబు త‌న‌యుడుగా తెరంగేట్రం చేసిన మంచు మ‌నోజ్ సినీ కెరీర్‌లో ప‌దేళ్ళ ప్ర‌స్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఓ మోస్తారు హిట్ సినిమాల‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన ఈ రాకింగ్ స్టార్ తానెప్పుడూ హీరోగా కాకుండా న‌టుడుగా ఫీల‌వుతాన‌ని, వీలైతే విల‌న్‌గా కూడా చేస్తాన‌ని చెప్ప‌డం విశేషం. డిఫ‌రెంట్ క‌థ‌లు, క్యారెక్ట‌ర్స్‌తో త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేసిన మ‌నోజ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించ‌లేదు. ఇప్పుడు మ‌నోజ్ మంచు చేసిన పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్‌ మూవీ `గుంటూరోడు`. మ‌రి ఈ `గుంటూరోడు` చిత్రం మ‌నోజ్‌కు ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చిందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

సూర్య‌నారాయ‌ణ‌రావు(రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కు త‌న కొడుకు క‌న్నా(మంచు మ‌నోజ్‌) అంటే ప్రాణం. త‌ల్లి లేని పిల్ల‌వాడు కాబ‌ట్టి అతి గారాబం చేస్తాడు. పెరిగి పెద్దైన క‌న్నాకు రెండు అల‌వాట్లు ఉంటాయి. ఆనందం వ‌స్తే డ్యాన్స్ చేయ‌డం, కోపం వ‌చ్చి చెయ్యి దుర‌ద పెట్టిన‌ట‌ప్పుడు గొడ‌వ‌లు ప‌డ‌టం. క‌న్నాను గొడ‌వ‌ల‌కు దూరం పెట్టాల‌నే ఉద్దేశంతో సూర్య నారాయ‌ణ అత‌నికి పెళ్ళి సంబంధం చూస్తాడు. పెళ్ళిచూపుల‌కు వెళ్ళినా క‌న్నా, అక్కడ పెళ్ళి కూత‌రు స్నేహితురాలు అమృత‌(ప్ర‌గ్యా జైశ్వాల్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ కోసం ఏమైనా చేయాల‌నుకునే రేంజ్‌కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృత అన్న‌య్య‌, గుంటూరులో మంచి పేరున్న క్రిమిన‌ల్ లాయ‌ర్ శేషు(సంప‌త్‌). శేషుకు ఈగో ఎక్కువ‌, త‌న‌ను ఎవ‌రైనా ఎదిరిస్తే ఒప్పుకోడు, వారిని ఏదో ఒక కేసులో ఇరికించేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో కన్నా, శేషుల మ‌ధ్య గొడ‌వ మొద‌లవుతుంది. ముందు శేషు, క‌న్నాను చాలా ఇబ్బంద‌ులకు గురి చేస్తాడు. అయితే క‌న్నా వాటిని త‌ప్పి కొట్టి, అత‌నికి స‌వాలుగా నిలుస్తాడు. ఈలోపు క‌న్నా, అమృత‌ల ప్రేమ వ్య‌వ‌హారం శేషుకు తెలుస్తుంది. అప్పుడు శేషు ఏం చేస్తాడు? క‌న్నా త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి శేషును ఎలా దెబ్బ తీస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


మంచు మ‌నోజ్ త‌న ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. డ్యాన్సులు, ఫైట్స్ విష‌యంలోనే కాదు, క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టి యూత్‌ను ప్రేమ విష‌యంలో ఎలా ఉన్నారు, త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య‌లు వ‌స్తే ఎలా రియాక్ట్ అవుతార‌నే దానికి సంబంధించి మంచి బాడీ లాంగ్వేజ్‌ను క‌న‌ప‌రిచాడు మ‌నోజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నోజ్ చేయ‌న‌టువంటి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా మూవీ ఇది. పాత్ర ప‌రంగా మ‌నోజ్ యాక్టింగ్ కూడా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ ప‌గ్ర్యా జైశ్వాల్‌, త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఇక మ‌నోజ్ తండ్రి పాత్ర‌లో న‌టించిన రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న పాత్ర‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశారు. ఇక విల‌న్‌గా న‌టించిన సంప‌త్ పాత్ర చాలా కొత్తగా ఉంది. ఈగోతో, కోపంతో ఏదో చేసేసి, త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇత‌రుల‌ను కేసులో ఇరికించే పాత్ర‌లో సంప‌త్ న‌ట‌న చాలా బావుంది. మ‌నోజ్‌, సంప‌త్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా ఉన్నాయి. వీరి మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఇక కోట‌ శ్రీనివాస‌రావు, రావు ర‌మేష్‌, కాశీవిశ్వ‌నాథ్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

 

స‌త్య‌, ప్ర‌వీణ్‌, పృథ్వీ కామెడి కూడా ప‌రావాలేదనిపిస్తుందే త‌ప్ప గొప్ప‌గా అనిపించ‌దు. ఇక సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మ‌నోజ్‌ను మాస్ హీరోగా చూపించే ప్ర‌య‌త్నం బాగానే ఉంది. అవుటండ్ అవుట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో మ‌నోజ్‌ను ప్రెజెంట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ప‌క్కా యూత్ మాట్లాడుకునే భాష‌లో, మాస్‌కు క‌నెక్ట్ అయ్యేలా స‌త్య సంభాష‌ణ‌లు రాసుకున్నాడు. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ డిజె.వ‌సంత్ అందించిన ట్యూన్స్ బావున్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం స‌రైనోడు సినిమా నుండి కాపీ కొట్టేశారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

(478)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ