WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'ను 'బొత్స' మరోసారి మోసగిస్తారా...?

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న సమయంలో ఇప్పటికీ అధికార యంత్రాంగం మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ కనుసన్నలోనే ఉందట. ఈ విషయం ఇటీవల కాలంలో ముఖ్యమంత్రికి తెలిసిందట. 1999లో కాంగ్రెస్‌ ఎంపిగా విజయం సాధించినప్పటి నుండి ఇప్పటి వరకు 'బొత్స' కోరుకున్నట్లే అన్నీ పనులు జరుగుతున్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ ఎంపిగా విజయం సాధించి టిడిపిలో చేరతానని నమ్మబలికి పనులు చక్కపెట్టుకున్న 'బొత్స' కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో పదేళ్లు మంత్రి పదవి నిర్వహించడమే కాకుండా పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహించడమే కాకుండా 'చంద్రబాబు'పై కఠిన,అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలో అధికారపార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కేంద్రమంత్రి పదవి నిర్వహిస్తున్న 'అశోక్‌గజపతిరాజు' స్థానికంగా ఉండడం లేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని 'బొత్స'పై విజయం సాధించి రాజకీయంగా ఎదిగినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అవినీతి వల్ల ఆమె కూడా ఏమీ చేయలేకపోతున్నారు. 

    'జగన్‌' పార్టీ నుండి టిడిపిలో చేరిన 'బొబ్బిలి' రాజాలు వారి నియోజకవర్గ పరిధి దాటి ముందుకు పోవడం లేదు. ఏడుసార్లు విజయం సాధించిన మాజీ మంత్రి నారాయణస్వామినాయుడు వయస్సు పైబడడంతో ఆయన క్రియాశీలకంగా ఉండడం లేదు. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న 'బొత్స' అధికార యంత్రాంగాన్ని కింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు తన గుప్పెట్లో పెట్టుకుని పనులు చక్కపెట్టుకుంటున్నారు. మాట వినని వారిని బెదిరిస్తున్నారు...మాట విని పనులు చక్కపెట్టేవారికి కానుకలు ఇప్పిస్తున్నారు. మరో రెండేళ్ల తరువాత 'జగన్‌' ముఖ్యమంత్రి అవడం ఖాయమని, మళ్లీ తాను మంత్రిని అయి చక్రం తిప్పటడం ఖాయమని చెబుతూ అధికారులపై పట్టుసాధిస్తున్నారు. 'బొత్స'ను ధీటుగా సమర్థంగా ఎదుర్కొనే నాయకులు టిడిపిలో లేకపోవడం ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుంది. 'బొత్స'పై పోటీ చేసి విజయం సాధించిన మంత్రి 'మృణాళిని' మళ్లీ అక్కడ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే రీతిలో ఆమె బంధు,మిత్రులు కోట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను..నా సిన్సియార్టీని, సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు మంత్రి పదవి ఇచ్చి తనను అవమానించారు...రాజకీయాలపై విరక్తి చెందానని టిడిపీ భీష్మాచార్యుడు 'నారాయణస్వామినాయుడు' సన్నిహితులతో చెబుతున్నారట. 'బొత్సా'కు బద్దశత్రువులైన 'బొబ్బలి' రాజాలు మంత్రి పదవి ఆశీంచి టిడిపిలో చేరినా వారి కోరిక ఇంత వరకూ నెరవేరకపోవడంతో వారు మౌనం వహిస్తున్నారు. 

    విజయనగరం జిల్లాలో అధికారయంత్రాంగంలో మెజార్టీ వర్గం మొత్తం 'బొత్స' చెప్పుచేతల్లో ఉందని కేంద్ర మంత్రి అశోక్‌కు తెలుసు, రాష్ట్ర మంత్రి మృణాళినికి తెలుసు...బొబ్బిలి రాజాలతో పాటు ఇతర ముఖ్యనాయకులందరికీ తెలుసు. అయినా 'బొత్స' దూకుడును వీరు అరికట్టలేకపోయారు. తాము కోరుకున్న పనులు జరుగుతున్నాయనే ఆనందం తప్ప...అధికారపరంగా, రాజకీయపరంగా 'బొత్స' ఎదుగుతున్నారని వీరు ఆలోచించడం లేదు...! రాజకీయాలలో గేటు వద్ద నిలబడే స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు శాసించే వరకు ఎదిగిన 'బొత్స'ను అధికారం లేనప్పుడూ ఏమీ చేయలేకపోయారు...ఇప్పుడు అధికారంలో ఉండీ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా విఫలం అవడంతో జిల్లాలో అంతా వన్‌మ్యాన్‌షో నడుస్తుంది. ఈ విషయంపై ఆలస్యంగా కళ్లు తెరిచిన 'చంద్రబాబు' తన బద్దశత్రువైన 'బొత్స'ను ఏ విధంగా అణగదొక్కాలనేదానిపై ఆలోచన చేస్తున్నారట. కానీ...చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి...?1999లో ఎంపిగా విజయం సాధించిన 'బొత్స' అప్పట్లో టిడిపిలో చేరతానని 'చంద్రబాబు'కు హామీ ఇచ్చి అనేక పనులు చక్కపెట్టుకుని తరువాత చేయి...ఇచ్చిన ఆయన ఇప్పుడూ అదే రకమైన పీలర్లు టీడీపీ నాయకత్వానికి వదులుతున్నారట. ఒకసారి మోసపోయిన 'చంద్రబాబు' మళ్లీ ఆయన చేతిలో మరోసారి మోసపోతారా...? అధికారం కోసం ప్లేట్‌ ఫిరాయించడంలో, నేతలను నమ్మించడంలో 'బొత్స'కు ఉన్న చావు తెలివితేటలు, అవకాశవాదాన్ని ఇటు వంటి నాయకుని తన రాజకీయ జీవితంలో చూడలేదని రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ సీనియర్‌ టిడిపి నాయకుడు అన్నారు.

(2479)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ