WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాకు నోటీసు ఇస్తారా...!

'కమ్మ' సామాజికవర్గాన్ని చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని,బాహాటంగా నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించడంపై త్వరలో షోకాజు నోటీసు జారీ చేస్తామని ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్‌, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావులు వ్యాఖ్యానించినట్లు బయటకు పొక్కింది. దీంతో ఆగ్రహం చెందిన 'రాయపాటి' నాకు నోటీసు ఇస్తారా...? ఇవ్వనీయండి...ఎలా సమాధానం చెప్పాలో...నాకు తెలుసు...అని ఆగ్రహంతో ఆఫ్‌ ది రికార్డుతో సన్నిహితులతో వ్యాఖ్యానించారట. పార్టీకి కానీ, పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా 'రాయపాటి' ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు...ఆయనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తన సామాజికవర్గానికి కాంగ్రెస్‌లో జరిగిన అన్యాయం, టిడిపి ప్రభుత్వంలో కూడా జరుగుతుందన్న బాధతో, ఆవేదన వ్యక్తం చేశారు...అంతే తప్ప 'చంద్రబాబు'ను అప్రదిష్టపాలు చేయాలనో, ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలనో ఆలోచన మా నాయకునికి లేదు...! ఇటీవల సచివాలయంలో జరుగుతున్న, జరిగిన కొన్ని సంఘటనలతో పాటు ఇతర విషయాలు మా నాయకుని దృష్టికి వెళ్లాయి..అందుకే ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు తప్ప...వేరే ఆలోచన లేదు..అని ఆయనకు అత్యంత సన్నిహితునిగా నిత్యం కనిపించే ఓ నాయకుడు తెలిపారు. 

    వీధిన పడి కొట్టుకునే వారిని, బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేసుకునే వారిని కనీసం పిలిచి మందలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో 'జనార్దన్‌' కార్యాలయ కార్యదర్శి హోదాలో ఉన్నారు..ఆయన ఎవరికైనా ఎప్పుడైనా షోకాజ్‌ నోటీసులు ఇచ్చారా...? సీనియార్టీనీ గుర్తించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం...అని 'రాయపాటి' అనుచరులు 'జనార్ధన్‌'ను హెచ్చరిస్తున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చాలా మంది కన్నా జూనియర్‌ను అని 'రాయపాటి' పలుసార్లు వ్యాఖ్యానించలేదా...? ఆయన తన సామాజికవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక పలుసార్లు 'చంద్రబాబు', చినబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎంత వరకు న్యాయం చేశారో...? తెలియదు...! ఎవరికో తీవ్ర అన్యాయం జరిగి ఉంటుంది...అది తట్టుకోలేక మా నాయకుడు 'రాయపాటి' ఆవేశపడ్డారు. కానీ...ఆయన ఆవేశానికి ఆ సామాజికవర్గంలో ప్రశంసలతో పాటు విపరీతమైన మద్దతు లభించింది. దీన్ని బట్టి ఆ సామాజికవర్గం తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లే కదా...? అన్ని కులాల వారిని కలుపుకుని రాజకీయాల్లోకి వెళ్లాలి. రెండు మూడు కులాల వారినీ గంటల తరబడి తన సమక్షంలో 'చంద్రబాబు' కూర్చుండబెట్టుకుంటున్నారు..పలు విషయాలు చర్చిస్తున్నారు...అదే 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారెవరైనా ఏకాతంతంగా కలవాలని 'చంద్రబాబు'ను అడిగితే ఇప్పుడు కాదు..తరువాత చూస్తానని తప్పుకుంటున్నారు. ఇది వివక్ష కాదా...? మేం పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇవ్వడం లేదా...? అందరితో పాటు సమాన గౌరవం కోరుతున్నామే తప్ప...ప్రత్యేక గౌరవ, మర్యాదలు మేం కోరుకోవడం లేదు. ఇప్పటికైనా ఏ కులంపైనా వివక్ష చూపకుండా అన్ని వర్గాల నాయకులను సమదృష్టితో 'చంద్రబాబు' చూడగలిగితే అదే పదివేలని ఆ సామాజికవర్గానికి చెందిన వారు అంటున్నారు.

(723)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ