WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నారాయణా' ఇదేమిటి....?

నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఓటర్లు అయిన స్థానిక సంస్థల ప్రతినిధులు 'జగన్‌' పార్టీలో చేరిపోవడంతో ఆగ్రహం చెందిన 'చంద్రబాబు', చినబాబులు మున్సిపల్‌ మంత్రి 'నారాయణ'ను తీవ్రంగా మందలించారట. 'నారాయణ'ను నమ్మి నెల్లూరు జిల్లాపై పెత్తనం అప్పచెప్పి పెద్ద తప్పిదం చేశానని 'చంద్రబాబు' ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వెలగపూడి సచివాలయ భవన నిర్మాణాలలో తప్పుదోవపట్టించారు...ఉద్యోగుల్లో వ్యతిరేకతను పెంచారు..అయినా సహించాను...పనితీరు మార్చుకోకుంటే ఎలా...? అధికారంలోకి ఉంది...మన పార్టీ...మన పార్టీ నాయకులు...పార్టీని వీడి 'జగన్‌' పార్టీలో చేరడం ఏమిటి...? అసలు 'నెల్లూరు'లో ఏం జరుగుతుంది...? ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు...! ఎవరెవరు తెరవెనక ఉండి వెన్నుపోటుకు సిద్ధం అవుతున్నారు...? అన్ని విషయాలు తనకు తెలియాలి అని 'చంద్రబాబు' ఆ జిల్లా నాయకులను ఆదేశించారు. 

   నెల్లూరు జిల్లాలో 'రెడ్డి'సామాజికవర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నా...ఆ సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే చాలా మంది నాయకులు పార్టీని వీడుతున్నారని 'చంద్రబాబు' దృష్టికి వచ్చింది. బలిజ వర్గానికి చెందిన నారాయణ, బీసీ వర్గానికి చెందిన 'బీద రవిచంద్ర'లు నెల్లూరు జిల్లాపై పెత్తనం చేయడం ఏమిటి...? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 'రెడ్డి' సామాజికవర్గాన్ని కాదని ఇతరులకు పెత్తనం ఇచ్చిన దాఖలు లేవు. దీని వలన పార్టీని ఒక తాటిపై నడిపించే నాయకుడు జిల్లాలో కరువయ్యారని పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. వాకాటి నారాయణరెడ్డికి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వమని చెప్పింది...మంత్రి నారాయణ, రవిచంద్రయాదవ్‌లే...! వారి మాటలను 'చంద్రబాబు' శిరసావహించి 'వాకాటి'కి టిక్కెట్‌ ఇచ్చారు. అయితే జరిగింది ఏమీటి...? టిడిపి ఓటర్లను ఒక తాటిపై నడిపించడంలో ఎందుకు విఫలం అయ్యారు. టిక్కెట్లు ఇస్తే కోట్లు ఖర్చుపెడతానన్న 'వాకాటి' నారాయణరెడ్డి సొమ్ములు బయటకు తీయడం లేదు. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాలను బరిలోకి దించితే 'జగన్‌' పార్టీ ఓటర్లలో కూడా చీలిక వచ్చి అవలీలగా విజయం సాధించేవారని, కానీ ఆయనను బరిలోకి రానీయకుండా మంత్రి నారాయణ, పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఆనం సోదరులు కూడా తెరవెనుక ఉండి కుట్ర పన్నారు. అందుకే పార్టీ అభ్యర్థికి ఇన్ని కష్టాలు అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 

  మంత్రి పదవి ఆశించిన 'సోమిరెడ్డి'కి కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తానని 'చంద్రబాబు' సూచనాప్రాయంగా చెప్పడంతో ఆ పోస్టుపై ఆసక్తి కనపరచడం లేదు. 'ఆదాల'కు పోటీ చేసే అవకాశం ఇస్తే ఆయన విజయం తప్పక సాధిస్తారని ఆ తరువాత మంత్రి అవుతారనే భయాందోళనతో పలువురు నాయకులు 'వాకాటి'కి మద్దతు ఇచ్చి పార్టీని బజారున పెట్టారని, ఇప్పటికైనా 'చంద్రబాబు' కళ్లు తెరిచి నేతలందరితో ప్రత్యేకంగా సమావేశమైన టిడిపి ఓటర్లను చేజారకుండా, 'జగన్‌' ఓటర్లను ఆకర్షించే విధంగా పథకం రూపొందించుకుండా ఉంటే అసలకే మోసం వస్తుందని సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. మంత్రి నారాయణ, రవిచంద్ర పెత్తనాన్ని తగ్గించి సీనియర్‌ నేతలందరితో 'మీరు' 'చినబాబు'తో కొంత మంది ఫోన్‌ ద్వారా సూచించినట్లు తెలిసింది. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో అవలీలగా పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమాతో ఉన్న పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు ఓటర్లు. 'వాకాటి'కి అవకాశం ఇచ్చి టెన్షన్‌ పెంచారని నాయకులువాపోతున్నారు. చేజారిన ఓటర్లను తిరిగి రప్పించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని 'చంద్రబాబు, చినబాబు పార్టీ నేతలను హెచ్చరించారు.


(576)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ