WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా -దోర్నాల-మం-చింతల సమీపంలో శ్రీశైలం ఘాట్ రోడ్ లో కర్నాటక రాష్ట్రం బళ్ళారి డిపో RTC బస్సు అదే రాష్ట్రం గుల్ బర్గా కి-చెందిన- తుఫాన్ వాహనం ఢీ కొనటంతో తుఫాన్ వాహనం లోని శ్రీదేవి-నాగం-విజయకుమార్ - అనే ముగ్గురు చనిపోయారు.ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలోని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా దొందూర్‌గావ్‌కు చెందిన రాజేశ్వర శ్రీదేవి(45), విజయకుమార్‌(40), నాగం(35) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పెదదోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల ఎస్సై నాగరాజు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  

(268)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ