WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మ‌రో రొటీన్ చిత్రం న‌గ‌రం...!

ప‌ల్లెటూరు నుండి సిటీకి చేరుకున్న యువ‌కుడు(శ్రీ), త‌న ప్రేమ కోసం మంచి ఉద్యోగాన్ని సంపాదించాల‌నుకుంటాడు. అందుకోసం ఓ ఇంట‌ర్వ్యూకి వెళ‌తాడు. అక్క‌డ హె.ఆర్‌(రెజీనా). రెజీనాను ప్రేమించే యువ‌కుడు(సందీప్ కిష‌న్‌). ఓ పోకిరి రెజీనాపై యాసిడ్ పోస్తాన‌ని చెప్ప‌డంతో సందీప్ అత‌నిపై యాసిడ్ పోస్తాడు. అలాగే త‌న కొడుకు ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో వైద్యం కోసం, బ్ర‌తుకు తెరువు కోసం సిటీకి వ‌చ్చిన డ్రైవ‌ర్‌(చార్లి)కి సిటీ గురించి అంత‌గా తెలియ‌దు. కానీ ఎలాగో మెనేజ్ చేస్తుంటాడు. సిటీలోని పెద్ద రౌడీ పి.కె.పి(మ‌ధుసూద‌న్‌) కొడుకును ఎవ‌రో కిడ్నాప్ చేసి డ‌బ్బు కోసం పి.కె.పిని బెదిరిస్తారు. ఈ నాలుగు క‌థలు ఏ మజిలీకి చేరాయ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...సినిమాలో ఎక్క‌డా హీరో, హీరోయిజం అనేవి క‌న‌ప‌డ‌వు. అంతా క్యారెక్ట‌ర్, కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీ. ఇలాంటి ఒక ప్ర‌య‌త్నంలో భాగం కావ‌డానికి ఒప్పుకున్నంద‌కు సందీప్‌కిష‌న్‌ను అభినందించాల్సిందే. సందీప్‌కిష‌న్‌, రెజీనాలు, చార్లి, మ‌ధుసూద‌న్ అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. కొత్త కుర్రాడు శ్రీ చాలా చ‌క్క‌టి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయాల‌నుకోవ‌డ‌మే గొప్ప. ఎందుకంటే నాలుగు క‌థ‌ల‌ను ఒక సంద‌ర్భంలో తెస్తూ సినిమాను న‌డిపించ‌డం అనేది క‌త్తిమీద సాములాంటిది.ఎక్కడ బెడిసి కొట్టినా ప్రేక్ష‌కుడుకి సినిమా అర్థం కాదు. కానీ ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి క‌థ‌నంతో సినిమాను చివ‌ర‌కు వ‌ర‌కు న‌డిపాడు. ద‌ర్శ‌కుడికి సెల్వ‌కుమార్ త‌న సినిమాటోగ్ర‌ఫీతో మంచి తోడ్పాటు నందించారు. జావేద్ రియాజ్ మంచి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ అందించారు. సినిమాలో అంతా బాగానే ఉన్నా, సినిమా ప్రారంభం నుండి ఫ‌స్టాఫ్ ముగిసే వ‌ర‌కు సినిమా చాలా స్లోగా సాగుతుంది. సినిమా ప్రారంభంలో అస‌లు క‌థ‌లోని ఆసక్తిక‌ర‌మైన అంశ‌మేంట‌నేది తెలియ‌కుండా ఉండ‌టం ప్రేక్ష‌కుడికి సినిమా ఏంటి చ‌ప్ప‌గా స్టార్ట్ అయ్యింద‌నే భావ‌న క‌లుగుతుంది. సినిమా అస‌లు పాయింట్‌లోకి రావ‌డానికి ద‌ర్శ‌కుడు సినిమాను సాగ‌దీయ‌డం అనేది స్ప‌ష్టంగా తెలుస్తుంది.

(201)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ