WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జ‌మున పాత్ర‌లో స‌మంత‌....!

మ‌హాన‌టి సావిత్రి జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో హీరోయిన్ స‌మంత ఓ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంద‌ట‌.  స్వప్న సినిమా, వైజయంతి మూవీస్‌ సంయుక్త నిర్మాణంలో అశ్వనీదత్‌ అల్లుడు నాగఅశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రీ-లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సావిత్రి ఫోటోను మధ్యలో పెట్టి ఇరువైపులా సమంత, కీర్తి సురేష్‌ల ఫోటోలు పెట్టారు. అయితే సావిత్రిగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా...మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్ర అయిన జ‌మున పాత్ర‌ను స‌మంత పోషిస్తుందట‌.   సావిత్రికి, జమునకు పడదనే విషయం తెలిసిందే. వారి మధ్య వృత్తిపరమైన, వ్యక్తిగతమైన వైరం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. సావిత్రి ఉన్న సినిమాలో నటించను అని కూడా జమున అన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆ తర్వాత సావిత్రికి అత్యంత సన్నిహితురాలిగా కూడా మెలిగింది జమున. అంత కీలకమైన పాత్రలో సమంత కనిపించబోతోందట.

(264)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ