WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాలకృష్ణ' 101వ చిత్రం ప్రారంభం...!

నందమూరి అందగాడు 'బాలకృష్ణ', స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'బాలయ్య' 101 చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. కూకట్‌పల్లిలోని 'ఉషాముల్లపూడి హాస్పటల్‌ వద్ద ఉన్న తులసివనం టెంపుల్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు 'రాజమౌళి, క్రిష్‌, బోయపాటి శ్రీనులతో పాటు హీరో 'గోపీచంద్‌' కూడా పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. నిర్మాణ సంస్థ 'భవ్యక్రియేషన్‌' సంస్థ భారీగా 'బాలయ్య' కటౌట్‌ను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరీ జగన్నాద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇంతకు ముందెప్పుడూ బాలయ్య 'పూరీ'తో సినిమా చేయలేదు. కాగా ఈ ఇద్దరు కలయకతో వస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాలుగు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి సెప్టెంబర్‌ 29న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ఆశిస్తోంది.


(280)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ